R.Narayanamurthy : వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు ఉద్యమం ఉధృతం.. సినీ నటుడు ఆర్‌ నారాయణమూర్తి మద్దతు

కార్మికుల ఉద్యమానికి సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి మద్దతు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వబోమని స్పష్టం చేశారు.

Vizag steel plant : వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కార్మికులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు 367వ రోజుకు చేరుకున్నాయి. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకూడదంటూ… కొనసాగిస్తున్న నిరసన దీక్షలకు నిన్నటితో ఏడాది పూర్తయింది. ఇవాళ జైల్‌ భరోకు పిలుపు ఇచ్చారు. జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు.

జీవీఎంసీ నుంచి డాబా గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టారు. కార్మికుల ఉద్యమానికి సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి మద్దతు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వబోమని స్పష్టం చేశారు. ప్రాణ త్యాగాలతో వచ్చిన కర్మాగారం ఇది.. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని మోదీ దిగిరావాల్సిదేనని అన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Ram Nath Kovind : నేడు శ్రీ రామానుజచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న రాష్ట్రపతి

విశాఖ ఉక్కు పరిరక్షణే ధ్యేయంగా సంవత్సర కాలంగా కార్మికులు పోరాటం చేస్తోన్నారు. ఒక వైపు ఉత్పత్తిని పరుగులు పెట్టిస్తూనే.., కర్మాగారాన్ని రక్షించుకునేందుకు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏడాదిగా నిర్వహిస్తోన్నారు. మరో వైపు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పట్ల తమకున్న పట్టుదల, ఉక్కు కార్మికుల ఐక్యతను చాటే విధంగా వేలాది మందితో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్మికవర్గ పోరాటానికి విశాఖ జిల్లాయే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని తరగతుల నుంచి విశాల మద్దతు లభించింన విషయం తెలిసిందే.

విశాఖ ఉక్కు ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగం, 67 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేశారు. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఢిల్లీ పీఠాలను కదిలించే విధంగా మహోద్యమం సాగింది. 64 గ్రామాలకు చెందిన 16,500 మంది రైతులు 22 వేల ఎకరాల భూముల త్యాగం ఫలితంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పడింది. రూ.8,849 కోట్లతో 3.2 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్‌ నిర్మాణం జరిగింది.

Hyderabad : రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

ప్రభుత్వం దీనికి సొంతగనులు కేటాయించకపోయినా కార్మికులు, ఉద్యోగుల శ్రమతో మరో రూ.13 వేల కోట్ల వెచ్చించి 7.3 మిలియన్‌ టన్నుల సామర్ధ్యానికి విస్తరించారు. ప్రభుత్వం ఒక్క పైసా కేటాయించకపోయినా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు రూ.50 వేల కోట్లు ఈ కాలంలో చెల్లించింది. అనేక ప్రభుత్వ పథకాలకు సబ్సిడీ ధరకు ఉక్కును సరఫరా చేస్తోంది. కరోనా సమయంలో ఆక్సిజన్‌ అందించి ప్రాణాలను కాపాడింది.

ట్రెండింగ్ వార్తలు