Coronavirus update AP : వామ్మో కరోనా..ఏపీలో 24 గంటల్లో 1326 కేసులు

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమౌతున్నాయి. గతంలో వందల కేసులుంటే..ఇప్పుడు వేయి కేసులు రికార్డువుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Corona AP : ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమౌతున్నాయి. గతంలో వందల కేసులుంటే..ఇప్పుడు వేయి కేసులు రికార్డువుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి కృష్ణాలో ఇద్దరు, అనంతపూర్, చిత్తూరు, గుంటూరులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అత్యధికంగా చిత్తూరులో 282, గుంటూరులో 271, విశాఖలో 222 కరోనా కేసులు వెలుగు చూశాయి.

30 వేల 678 శాంపిల్స్ పరీక్షించగా..1326 మంది కోవిడ్ – 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 911 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారని వెల్లడించింది. నేటి వరకు రాష్ట్రంలో 1,52,39,114 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 9,09,002 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 8 లక్షల 91 వేల 048 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా..ఈ వైరస్ కారణంగా.. 7 వేల 244 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 10710గా ఉన్నాయి.

14వ తేదీ 298
15వ తేదీ 147
16వ తేదీ 261
17వ తేదీ 253
18వ తేదీ 218
19వ తేదీ 246

20వ తేదీ 380
21వ తేదీ 368
22వ తేదీ 310
23వ తేదీ 492
24వ తేదీ 585
25వ తేదీ 758

26వ తేదీ 984
27వ తేదీ 947
28వ తేదీ 1005
29వ తేదీ 997
30వ తేదీ 993
31వ తేదీ 1184

01వ తేదీ 1271
02వ తేదీ 1288
03వ తేదీ 1398
04వ తేదీ 1730
05వ తేదీ 1326

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 23 చిత్తూరు 282. ఈస్ట్ గోదావరి 29. గుంటూరు 271. వైఎస్ఆర్ కడప 31. కృష్ణా 138. కర్నూలు 50. నెల్లూరు 171. ప్రకాశం 54. శ్రీకాకుళం 52. విశాఖపట్టణం 222. విజయనగరం 2. వెస్ట్ గోదావరి 01. మొత్తం కేసులు : 1326

 

ట్రెండింగ్ వార్తలు