Corona : తెలుగు రాష్ట్రాల సచివాలయాల్లో కరోనా..హఢలిపోతున్న ఉద్యోగులు

కంటికి కనిపించని వైరస్‌.. నిలువెత్తు మనిషిని గడగడలాడిస్తోంది. ఎక్కడ దాగుందో తెలియక జనం కంగారుపడిపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్తే పర్వాలేదు.. కానీ వెళ్తూ వెళ్తూ ప్రాణాలు తీసుకుపోతోంది.

Telugu States : కంటికి కనిపించని వైరస్‌.. నిలువెత్తు మనిషిని గడగడలాడిస్తోంది. ఎక్కడ దాగుందో తెలియక జనం కంగారుపడిపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్తే పర్వాలేదు.. కానీ వెళ్తూ వెళ్తూ ప్రాణాలు తీసుకుపోతోంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఏపీ సచివాలయంలో .. వైరస్‌ డేంజర్‌బెల్స్‌ మోగిస్తోంది. దీంతో విధులకు హాజరుకావాలంటేనే ఉద్యోగులు హడలిపోతున్నారు. తాజాగా మరో ఉద్యోగి అజయ్‌బాబు ప్రాణాలు కోల్పోయాడు.

ఒకటి కాదు రెండు కాదు కేవలం వారం రోజుల్లోనే .. సచివాలయంలో కరోనా కాటుకు ఐదుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఫస్ట్‌వేవ్‌లో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందగా.. సెకండ్‌వేవ్‌లో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో సచివాలయంలో అడుగుపెట్టేందుకు ఉద్యోగులు జంకుతున్నారు. తమకు వర్క్‌ఫ్రమ్‌ హోం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రాణాలు పణంగా పెట్టాలంటూ భయపడుతున్నారు.

ఇక తెలంగాణ సెక్రటేరియేట్‌లో కూడా కరోనా కలకలం రేపుతోంది. సచివాలయ ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 100 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్‌ కట్టడికి నిషేధాజ్ఞలు జారీ చేశారు. సచివాలయానికి విజిటర్స్‌ అనుమతిని నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరి అయితే ఉన్నతాధికారి అనుమతి ఉండాల్సిదేనని చెప్పారు. కోవిడ్‌ భయంతో విధులకు రావాలంటేనే ఉద్యోగులు వణికిపోతున్నారు. 50శాతం మంది విధుల్లో ఉండేందుకు ఉద్యోగులు అనుమతి కోరుతున్నారు. ఇప్పటికే సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు సచివాలయ ఉద్యోగ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.

Read More : కేంద్రం కీలక నిర్ణయం..80 కోట్ల మంది పేదలకు 2నెలలు ఉచితంగా రేషన్

ట్రెండింగ్ వార్తలు