Earthquake In Kurnool: కర్నూలు జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో తెల్లవార్లు రోడ్లపైనే ప్రజల జాగరణ

కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలం రాతన గ్రామంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు భయంతో వణికిపోయారు. సోమవారం రాత్రి సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన రాతన గ్రామ ప్రజలు, రాత్రంతా రోడ్లపైనే జాగరణ చేశారు.

Earthquake In Kurnool: ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇటీవల టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించి 50వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. దీంతో భూకంపం అంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దేశంలోనూ పలు ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలో భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలంలో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సోమవారం రాత్రి సమయంలో తుగ్గలి మండలం రాతన గ్రామంలో ఈ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరోసారి ఎక్కడ భూప్రకంపనలు చోటుచేసుకుంటాయోనన్న భయంతో తెల్లవార్లు భయంతో ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపైనే స్థానిక ప్రజలు జాగరణ చేశారు. భూప్రకంపనల ప్రభావంతో పలు ఇళ్లు, రోడ్లు నెర్రలు, చీలికలకు గురైనట్లు స్థానికులు పేర్కొంన్నారు.

Earthquake In AP : నెల్లూరు జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు .. భయాందోళనలో స్థానికులు

కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సోమవారం రాత్రి సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ఈ భూకంపం తీవ్రత ఎంత ఉందనే విషయంపై స్పష్టత రాలేదు. రిక్టర్ స్కేలుపై ఎంత నమోదైంది, ఏమైనా ఆస్తినష్టం జరిగిందా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. రాతన గ్రామంలో సుమారు 15 ఇళ్లకు, సిమెంట్ రోడ్డుకు నెర్రలు వచ్చినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఇళ్లకు పగుళ్లు వచ్చే స్థాయిలో భూకంపం వచ్చిందంటే.. భూకంప తీవ్రత ఎక్కువగానే ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి భూకంపం వస్తే తీవ్రస్థాయిలో ఉంటుందనే భయంతో స్థానిక ప్రజలు రాత్రంతా ఇళ్లలోకి వెళ్లకుండా ఆరుబయట రోడ్లపైనే జాగరణ చేశారు.

Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.0 గా నమోదు

భూకంపం ప్రభావిత గ్రామంలో అధికారులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి పర్యటించారు. భూప్రకంపనలకు నెర్రెలువారిన ఇళ్లను పరిశీలించారు. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగానేకాక ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భూమి కంపించినట్లు వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో కంచికర్ల, చందర్లపాడు, నందిగామ, వీరులపాడు తదితర మండలాల్లో భూమి కంపించింది. పల్నాడు జిల్లాలోని పలు మండలాల్లోనూ గతంలో భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే ఈ భూప్రకంపనలు చాలా స్వల్పంగా చోటుచేసుకున్నాయి. గతంలో భూకంపాలు వచ్చినా పెద్దగా ఆందోళన చెందని ప్రజలు.. ఇటీవల టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో భూకంపం విధ్వంసాన్ని చూసి స్వల్పంగా భూమి కంపించినా భయంతో వణికిపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు