Kanuma Special: కోనసీమలో కనులపండువగా ప్రభల తీర్థం ఉత్సవాలు

కనుమ పండుగ రోజున ప్రభల జాతర ఉత్సవం.. కోనసీమ గ్రామాల్లో 400 ఏళ్ల సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. అంబాజీపేట (మం) జగ్గన్నతోటకు భారీ ప్రభలు చేరుకున్నాయి.

Kanuma Special: సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకున్నారు. రెండు రోజుల పాటు ఆనందోత్సాహాలతో గడిపిన ప్రజలు మూడో రోజు కనుమ పండుగను విశిష్టంగా జరుపుకున్నారు. కనుమ పండుగ పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాలో ప్రభల ఉత్సవం నిర్వహించారు. కనుమ పండుగ రోజున ప్రభల జాతర ఉత్సవం.. కోనసీమ గ్రామాల్లో 400 ఏళ్ల సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ప్రభల తీర్థంలో పాల్గొనేందుకు యువకులు ఎంతో ఉత్సాహం కనబరుస్తారు. భారీ ఎత్తైన ప్రభలు ఏర్పాటు చేసి విశిష్టతను చాటుతారు.

Also read: Vijayawada News: ఇంద్రకీలాద్రి పై కరోనా కలకలం

కనుమ పండుగ సందర్భంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట (మం) జగ్గన్నతోటకు భారీ ప్రభలు చేరుకున్నాయి. మండలంలోని 11 గ్రామాల నుంచి ప్రభలు జగ్గన్నతోటకు చేరుకున్నాయి. భారీ ప్రభలను యువకులు తమ భుజాలపై మోసుకుంటూ జగ్గన్నతోటకు చేర్చారు. మండలంలోని వాకలగరువు, తొండవరం గ్రామాల నుంచి ఎత్తయిన ప్రభలు వస్తుంటాయి. ప్రభల తీర్థం సందర్భంగా ఏకాదశ రుద్రుల దర్శనం కోసం భక్తులు, కోనసీమ ప్రజలు పెద్ద సంఖ్యలో జగ్గన్నతోటకు తరలివస్తున్నారు. ప్రభల జాతర సందర్బంగా జగ్గన్నతోట వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యార్ధం జగ్గన్నతోటకు చేరుకునే రహదారిని తీర్చిదిద్దారు.

Also read: EV Charging: దేశంలో ఎవరైనా ఎక్కడైనా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు

ట్రెండింగ్ వార్తలు