Hardhik Pandya : వ‌రుస ఓట‌ముల‌పై హార్దిక్ పాండ్య వ్యాఖ్య‌లు వైర‌ల్‌..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు ప్లే ఆఫ్స్ చేరిన మొద‌టి జ‌ట్టుగా నిలిచింది.

PIC Credit JIO Cinema

Pandya : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు ప్లే ఆఫ్స్ చేరిన మొద‌టి జ‌ట్టుగా నిలిచింది. శనివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 18 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మ‌రోవైపు ముంబై ఇండియ‌న్స్‌కు ఈ సీజ‌న్‌లో ఇది తొమ్మిదో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.

వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌ను 16 ఓవ‌ర్ల‌కు కుదించారు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. వెంక‌టేష్ అయ్య‌ర్ (21 బంతుల్లో 42), నితీశ్ రాణా (23 బంతుల్లో 33) లు రాణించ‌డంతో నిర్ణీత ఓవ‌ర్ల‌లో కేకేఆర్ ఏడు వికెట్లు కోల్పోయి 157 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో కోల్‌క‌తా 18 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

Rohit Sharma : కోల్‌క‌తా డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శ‌ర్మ‌.. ముంబైని వీడ‌డం ఖాయ‌మైన‌ట్లేనా?

కాగా.. ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం హార్దిక్ పాండ్య స్పందించాడు. వ‌రుస ఓట‌ముల‌ను జీర్ణించుకోవ‌డం కొంచెం క‌ష్టంగా ఉంద‌న్నాడు. చేధ‌న‌లో అద్భుత‌మైన ఆరంభం ల‌భించిన‌ప్ప‌టికీ స్వ‌దినియోగం చేసుకోలేక‌పోయిన‌ట్లు చెప్పాడు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల వ‌ల్ల పిచ్ అనుకున్న‌దాని కంటే భిన్నంగా స్పందించింద‌ని చెప్పుకొచ్చాడు. అయితే.. బ్యాటింగ్‌కు అంత క‌ష్ట‌మైన వికెట్ కాద‌న్నాడు. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా బౌల‌ర్లు బౌలింగ్ చేశార‌న్నాడు.

158 ప‌రుగులు ఛేదించ‌ద‌గ్గ ల‌క్ష్య‌మేన‌ని, తొలుత బౌలింగ్ చేసేట‌ప్పుడు బౌల‌ర్లు కాస్త ఇబ్బంది ప‌డిన‌ట్లు తెలిపాడు. ఇక బంతి బౌండ‌రీ వెళ్లిన స‌మ‌యంలో త‌డిగా మారి వెన‌క్కు వ‌చ్చింద‌న్నాడు. మంచు ప్ర‌భావ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని, దీంతో బ్యాటింగ్ సులువైంద‌న్నాడు. ఈ సీజ‌న్‌లో ఆఖ‌రి మ్యాచ్ కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌ణాళిక‌లు ఏమీ లేవ‌ని, మంచి క్రికెట్ ఆడి విజ‌యంతో ముగించాల‌ని భావిస్తున్న‌ట్లు హార్దిక్ తెలిపాడు.

Hardik Pandya : తొమ్మిది మ్యాచుల్లో ఓడిన ముంబై.. పాండ్య కెప్టెన్సీపై యువ పేస‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

 

ట్రెండింగ్ వార్తలు