Rohit Sharma : కోల్‌క‌తా డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శ‌ర్మ‌.. ముంబైని వీడ‌డం ఖాయ‌మైన‌ట్లేనా?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ ప్ర‌ద‌ర్శ‌న దారుణంగా ఉంది

Rohit Sharma : కోల్‌క‌తా డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శ‌ర్మ‌..  ముంబైని వీడ‌డం ఖాయ‌మైన‌ట్లేనా?

Image posted on x by @SPORTYVISHAL

Rohit Sharma in KKR Dressing Room : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ ప్ర‌ద‌ర్శ‌న దారుణంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 13 మ్యాచులు ఆడ‌గా నాలుగు మ్యాచుల్లోనే గెలుపొందింది. తొమ్మిది మ్యాచుల్లో ఓడిపోయింది. 8 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించిన మొద‌టి జ‌ట్టుగా నిలిచింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది. స్టార్ ఆట‌గాళ్ల నిల‌క‌డ‌లేమీ, ఆన్‌ఫీల్డ్ స‌మ‌స్య‌లు ముంబై ఫ‌లితాల‌పై ప్ర‌భావం చూపించాయి.

ఈ సీజ‌న్‌కు ముందు జ‌ట్టుకు ఐదు సార్లు క‌ప్పును అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యం పై రోహిత్ శ‌ర్మ అసంతృప్తిగా ఉన్నాడ‌ని, ముంబై త‌రుపున ఇదే ఆఖ‌రి సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయ‌ర్‌తో రోహిత్ మాట్లాడిన మాటలు సంచ‌ల‌నంగా మారాయి.

Hardik Pandya : తొమ్మిది మ్యాచుల్లో ఓడిన ముంబై.. పాండ్య కెప్టెన్సీపై యువ పేస‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేకేఆర్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా ప్రాక్టీస్ కోసం ఈడెన్ గార్డెన్స్‌కు రోహిత్ వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో అభిషేక్ నాయ‌ర్ అక్క‌డే ఉన్నాడు. ‘ఒక్కొక్క‌టిగా అన్నీ మారిపోతున్నాయి. అదంతా వాళ్ల‌పై ఆధార‌ప‌డి ఉంది. దీని గురించి నేను ప‌ట్టించుకోను. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ అది నా ఇల్లు. నేను నిర్మించిన దేవాల‌యం. ‘అని నాయ‌ర్‌తో రోహిత్ అన్నాడు. ఇందులో ముంబై ఇండియ‌న్స్ పేరును ఎక్క‌డా రోహిత్ ప్ర‌స్తావించ‌పోయిన‌ప్ప‌టికీ కూడా అత‌డి మాట‌ల‌ను బ‌ట్టి ముంబై గురించే మాట్లాడిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక మ్యాచ్ సంద‌ర్భంగా రోహిత్ శ‌ర్మ చేసిన ప‌ని అత‌డు ముంబై వీడ‌నున్నాను అనే వార్త‌ల‌కు బ‌లం చేకూర్చిన‌ట్లైంది. శ‌నివారం కోల్‌క‌తా, ముంబై జ‌ట్లు ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా చాలా ఆల‌స్యంగా ప్రారంభమైంది. ఈ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ కేకేఆర్ ఆటగాళ్ల‌తో తీవ్రంగా చ‌ర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఫోటోల్లో భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, కేఎస్ భరత్, మనీష్ పాండే వంటి ఆటగాళ్లతో కలిసి రోహిత్‌తో మాట్లాడుతున్నట్లు కనిపించింది.

KL Rahul : కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోనున్న కేఎల్ రాహుల్‌.. తాజా ట్విస్ట్‌ ఇదే

ఇక మ్యాచ్ విషయానికి వ‌స్తే.. వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్‌ను 16 ఓవ‌ర్ల‌కు కుదించారు. కేకేఆర్ మొద‌ట‌ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 16 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 157 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై నిర్ణీత 16 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో కోల్‌క‌తా 18 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.