KL Rahul : కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోనున్న కేఎల్ రాహుల్‌.. తాజా ట్విస్ట్‌ ఇదే

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతిలో ఘోర ప‌రాజ‌యం త‌రువాత ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ భ‌విష్య‌త్తు తీవ్ర చ‌ర్చ నీయాంశంగా మారింది.

KL Rahul : కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోనున్న కేఎల్ రాహుల్‌.. తాజా ట్విస్ట్‌ ఇదే

PIC credit @LSG

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతిలో ఘోర ప‌రాజ‌యం త‌రువాత ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ భ‌విష్య‌త్తు తీవ్ర చ‌ర్చ నీయాంశంగా మారింది. అత‌డు కెప్టెన్‌గా త‌ప్పుకుని మిగిలిన రెండు మ్యాచుల్లో త‌న బ్యాటింగ్ పై ఫోక‌స్ చేసే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీజ‌న్‌లో మ‌రో రెండు మ్యాచులే ఆడాల్సి ఉన్న త‌రుణంలో కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను నుంచి త‌ప్పుకునేందుకు కేఎల్ రాహుల్ ఇష్ట‌ప‌ప‌డం లేదని, ఈరెండు మ్యాచుల‌కు కూడా నాయ‌క‌త్వం వ‌హించాల‌ని అనుకుంటున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ రెండు మ్యాచుల్లో ల‌క్నో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవ‌కాశాలు ఉంటాయి. అయితే అది మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచులు ఆడిన ల‌క్నో 6 మ్యాచుల్లో గెలిచింది. మ‌రో ఆరు మ్యాచుల్లో ఓడింది. ఆ జ‌ట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది.

Sam Curran Apologize : క్ష‌మించండి.. వ‌చ్చే ఏడాది మా స‌త్తా చూపిస్తాం : సామ్ క‌ర‌న్‌

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో జ‌ట్టు ఘోరంగా ఓడిపోయింది. 167 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కాపాడుకోలేక‌పోయింది. ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్‌), అభిషేక్ శ‌ర్మ (28 బంతుల్లో 75నాటౌట్‌) దంచికొట్ట‌డంతో 10 ఓవ‌ర్ల‌లోపే హైద‌రాబాద్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో రాహుల్ 33 బంతులు ఎదుర్కొని కేవ‌లం 29 ప‌రుగులే చేశాడు. ఓటమికి రాహుల్ స్లో ఇన్నింగ్స్ కూడా ఓ కార‌ణ‌మ‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

కాగా.. మ్యాచ్ అనంత‌రం ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గోయెంకా కోపంగా కేఎల్ రాహుల్‌తో మాట్లాడిన వీడియో వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి మ‌రో జట్టు అధికారికంగా నిష్క్రమణ

ఈ సీజ‌న్‌లో కేఎల్ రాహుల్ 12 మ్యాచులు ఆడాడు. 460 ప‌రుగులు చేశాడు. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ రాణిస్తే 500 ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. అయితే.. అత‌డి స్ట్రైక్ రేటు 136.09 స‌మ్య‌స‌గా మారింది. ప‌వ‌ర్ ప్లేలో దూకుడుగా ఆడాల్సిన స‌మ‌యంలో నెమ్మ‌దిగా ఆడ‌తాడ‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక లక్నో మే 14న న్యూఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 17న వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచులు ఆడ‌నుంది.