Varsham : అసలు ‘వర్షం’ టైటిల్ ప్రభాస్ది కాదు.. ఏ హీరోదో తెలుసా? ఆ సినిమా ఏంటో తెలుసా?
ఈ సినిమా ప్రభాస్ కి స్టార్ డమ్ తీసుకొచ్చింది. (Varsham)
Varsham
Varsham : ప్రభాస్ కెరీర్ లో భారీ విజయం సాధించిన మొదటి సినిమా వర్షం. ఈ సినిమా ప్రభాస్ కి స్టార్ డమ్ తీసుకొచ్చింది. 2004లో వర్షం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. MS రాజు నిర్మాణంలో పరుచూరి బ్రదర్స్ కథతో శోభన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
వర్షం బ్యాక్ డ్రాప్ లో కథ కావడంతో ఈ సినిమాకు ముందు నుంచే వర్షం అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఆ టైటిల్ రిజిస్టర్ చేయిద్దామనుకుంటే అప్పటికే మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు VN ఆదిత్య ఆ టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. నాగార్జున సినిమా కోసం VN ఆదిత్య వర్షం టైటిల్ రిజిస్టర్ చేయించాడు. నిర్మాత MS రాజు అడగడంతో VN ఆదిత్య ఒప్పుకొని ఆ టైటిల్ ని ఇచ్చేసాడు.
అలా ప్రభాస్ సినిమాకు వర్షం టైటిల్ వచ్చింది. వర్షం టైటిల్ ప్రభాస్ కి ఇచ్చేయడంతో నాగార్జున సినిమా కథలో కొన్ని మార్పులు చేసుకొని ఆ సినిమాకు నేనున్నాను అనే టైటిల్ పెట్టుకున్నారు. వర్షం సినిమా 2004 సంక్రాంతికి రిలీజయి పెద్ద హిట్ అవ్వగా నేనున్నాను సినిమా 2004 ఏప్రిల్ లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది.
