Huge cash seized
Huge cash seized In Khammam : లోక్ సభ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది. జిల్లాలోని కూసుమంచి మండలం దేవుని తండా వద్ద కారు నుంచి సుమారు రూ. 1.5కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో నగదు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కారును గుర్తించి వెంబడించారు. దీనిని గమనించిన వారు కారును వేగంగా పొనివ్వడంతో అదుపుతప్పి దేవుని తండా వద్ద బోల్తాపడింది. కారులో రెండు బ్యాగుల్లో కరెన్సీ కట్టలు ఉండటంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని లెక్కించారు. సుమారు రూ. 1.5కోట్ల నగదు ఉన్నట్లు తేల్చారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవటంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. కారులో డబ్బును తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆట మధ్యలో ఆసక్తికర ఘటన
రేపు (సోమవారం) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో డబ్బులను ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి ఈ డబ్బును తరలిస్తున్నారని, కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో ఓటర్లకు పంపిణీ చేసి ప్రలోభపెట్టేందుకు డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, కూసుమంచి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.. ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు.
Also Read : తెలంగాణలో పోలింగ్‌కు సర్వంసిద్ధం.. అత్యధిక అభ్యర్థులు బరిలోఉన్న నియోజకవర్గం ఏదో తెలుసా?