Rains in Telangana Weather Report
తెలంగాణలో రాగల మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నిన్న మరత్వాడ నుంచి కోమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి/గాలి విచ్చిన్నతి ఈ రోజు తూర్పు మధ్యప్రదేశ్ నుండి విదర్భ, మరాత్వాడ, కర్ణాటక, తమిళనాడు మీదుగా కోమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయి.
దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ, రేపు, ఎల్లుండి 30 – 40 కి.మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలో కురిసిన వర్షాలతో ఎండల నుంచి కాస్త ఉపశమనం లభిస్తోంది.
Also Read : ఖమ్మం జిల్లాలో భారీగా నగదు పట్టివేత.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు