Gold Price Today : గోల్డ్‌ కొంటున్నారా.. అయితే గుడ్‌న్యూస్..! తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం ఉదయం నమోదైన బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

Gold

Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులు మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలు, పెళ్లిళ్ల సందడి షురూ అయింది. దీంతో బంగారం దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది. అయితే, తాజాగా బంగారం కొనుగోలు చేసేవారికి కొంచెం ఊరట కలిగించే అంశం ఏమిటంటే కొద్దిరోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుకుంటూ వస్తున్నాయి. గత నెల ప్రారంభంలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఈనెల ప్రారంభం నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం.

Gold

శనివారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,020 ఉంది. శుక్రవారంతో పోలిస్తే బంగారం ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.73,500 లుగా కొనసాగుతోంది.

Gold

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విశాఖపట్టణం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. 10గ్రాముల బంగారం ధరలు పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,020గా ఉంది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం ఉదయం వరకు నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

– ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,250 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 59,170గా ఉంది.
– చెన్నైలో 10గ్రాముల బంగారం ధర రూ. 54,550 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 59,150గా ఉంది.
– దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 59,020గా ఉంది.
– బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 54,100 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 59,020గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు