Dementia Smart Watch : వృద్ధుల్లో డిమెన్షియా.. స్మార్ట్ వాచ్‌తో ఎక్కడున్నా ఈజీగా ట్రాక్ చేయొచ్చు!

Dementia Smart Watch : ఈ వాచ్ సాయంతో మతిమరుపుతో బాధపడే వృద్ధులు ఎక్క‌డున్నా సులభంగా ట్రాక్ చేయొచ్చునని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. వారికి ఏం జ‌రిగినా సంర‌క్ష‌కుల‌కు క్ష‌ణాల్లో స‌మాచారం వెళ్తుంది. 

Anvaya’s smartwatch provides instant alerts for elderly with dementia

Dementia Smart Watch : వయస్పు పెరిగే కొద్ది మతిమరుపు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా వృద్ధులలో డిమెన్షియా అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. సహజంగానే వృద్ధుల‌లో డిమెన్షియా స‌మ‌స్య వస్తుంటుంది. కానీ, వృద్ధుల్లో వేధించే మతిమరుపు సమస్యను అధిగ‌మించేందుకు అవసరమైన వ్య‌వ‌స్థలు ఇప్పటికీ అందుబాటులో లేవని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇలాంటి వృద్ధుల కోసం ప్ర‌త్యేకంగా స్మార్ట్ వాచ్ రూపొందించింది ఓ అన్వ‌య సంస్థ. అంతేకాదు.. ఆ వాచ్ పేరిట పేటెంటు కూడా పొందింది. ఈ వాచ్ సాయంతో మతిమరుపుతో బాధపడే వృద్ధులు ఎక్క‌డున్నా సులభంగా ట్రాక్ చేయొచ్చునని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. వారికి ఏం జ‌రిగినా సంర‌క్ష‌కుల‌కు క్ష‌ణాల్లో స‌మాచారం వెళ్తుంది.

Read Also : Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్‌లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!

ఇలాంటి డివైజ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వ‌యోవృద్ధులంద‌రి ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. బేగంపేట‌లోని ఫ్యామిలీ వ‌ర‌ల్డ్‌లో అన్వ‌య సంస్థ ఎనిమిదో వార్షికోత్స‌వం వ్య‌వ‌స్థాప‌కుల దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా టి-హ‌బ్ సీఈఓ మ‌హంకాళి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ.. వృద్ధుల సంర‌క్ష‌ణకు ఏఐ ఆధారిత యాప్ తీసుకురావడం చాలా అభినంద‌నీయ‌మ‌ని చెప్పారు. డిమెన్షియా అనేది వ‌యోవృద్ధులంద‌రిలో చాలా ఎక్కువ‌గా వేధించే స‌మ‌స్య‌గా ఆయన పేర్కొన్నారు. అన్వ‌య సంస్థ ఒక స్మార్ట్ వాచ్ త‌యారుచేసి దానికి పేటెంటు పొందడం చాలా బాగుందని చెప్పారు.

సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌శాంత్ రెడ్డి మాట్లాడుతూ.. “వ‌యోవృద్ధుల‌కు సేవ‌లు అందించే ల‌క్ష్యంతో మా సంస్థ‌ను స్థాపించాం. అన‌తికాలంలోనే బెంగ‌ళూరు, చెన్నై వంటి 40 న‌గ‌రాల‌కూ విస్త‌రించాం. డిమెన్షియా కేర్ రంగంలో వృద్ధుల‌కు సేవ‌లు అందించాల‌ని గుర్తించాం. దేశంలో తొలిసారిగా ఏఐ ఎనేబుల్డ్ డిమెన్షియా కేర్ ఎట్ హోంను ప్రారంభించాం. ఉద్యోగుల సంర‌క్ష‌ణకు అన‌న్య నిశ్చింత్ అనే ఏఐ ప్లాట్‌ఫాం తీసుకొచ్చాం. అన‌న్య కిన్ కేర్ అనే రిమోట్ పేషెంట్ మానిట‌రింగ్ సిస్టం ప్ర‌వేశ‌పెట్టాం’ అని తెలిపారు.

Read Also : Cervical Cancer : క్యాన్సర్‌ని జయించి శిశువుకు జన్మచ్చిన యువతి!

ట్రెండింగ్ వార్తలు