Japanese Woman : నాన్నది భారత్.. అమ్మది జపాన్.. పూరిలో హోటల్.. గ్రేట్ లవ్ స్టోరీ..!

Japanese Woman : ఒడిశాలో పూరీలో హోటల్ నడిపే సమయంలో అది ప్రేమగా ఎలా మారింది అనే ఆసక్తికరమైన విషయాలను కుమారుడు మొహంతి సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో పంచుకున్నాడు.

Love Story Of Japanese Woman And Indian Man ( Image Source : Google )

Japanese Woman : అతడో రాపర్.. అందరూ ముద్దుగా రాపర్ బిగ్ డీల్ అని పిలుస్తారు. ఇటీవల తన తల్లిదండ్రుల గ్రేట్ లవ్ స్టోరీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేశాడు. అతడి తండ్రి ఇండియన్ అయితే.. తల్లి జపానీస్.. వీరిద్దరికి జన్మించిన వ్యక్తే సమీర్ రిషు మొహంతి.. అసలు తన పేరంట్స్ ఏ విధంగా కలుసుకున్నారు. వారి ఇద్దరికి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది. ఒడిశాలో పూరీలో హోటల్ నడిపే సమయంలో అది ప్రేమగా ఎలా మారింది అనే ఆసక్తికరమైన విషయాలను కుమారుడు మొహంతి సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో పంచుకున్నాడు.

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

ఆమెకు పూరీ అంటే చాలా ఇష్టం :
“ఇది మా అమ్మ, నాన్నల అందమైన ప్రేమకథ.. ‘‘ అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. తాను కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తూ తన తల్లి మొదటిసారిగా పూరీని సందర్శించినట్లు తెలిపాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆమె పూరిలో స్థిరపడాలని నిర్ణయించుకుంది. అక్కడే తన పుస్తకాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది. “ఆమెకు పూరీ అంటే చాలా ఇష్టం. కాబట్టి, గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె పూరీలో స్థిరపడాలని, పుస్తక రచన కొనసాగించాలని కోరుకుంది. అయితే, ప్రతి ఒక్కరికీ ఆదాయ వనరు కావాలి. కాబట్టి, ఆమె జపాన్ పర్యాటకుల కోసం ఒక హోటల్‌ను నిర్మించాలని కోరుకుంది” అని మొహంతి ఒడియాలో చెప్పారు.

వారి ప్రేమకథకు ఇది నిదర్శనం :
అయితే, ఆమె విదేశీ పౌరురాలు కావడంతో అతని తల్లి తన హోటల్ కోసం భూమిని కొనుగోలు చేయలేకపోయింది. ఆమె చివరికి అతని తండ్రిని కలుసుకుంది. ఆ తర్వాత ప్రేమించి వివాహం చేసుకుంది. ఇద్దరూ కలిసి హోటల్‌ని నిర్మించి దానికి ‘లవ్ అండ్ లైఫ్’ అని పేరు పెట్టారు. ఈ హోటల్ ఇప్పటికీ పూరీలో ఉందని మొహంతి తెలిపారు. “మా అమ్మా నాన్నల ప్రేమకథకు ఇది నిదర్శనం. కొన్ని ప్రేమకథలు జీవితాంతం నిలిచి ఉంటాయనేది నిజం” అని మొహంతి ముగించాడు.

మొహంతి కొద్ది రోజుల క్రితమే ఈ వీడియోను పోస్ట్ చేయగా ఈ వీడియో 72వేల కన్నా ఎక్కువ లైక్‌లు, 6లక్షల 80వేల కన్నా ఎక్కువ వ్యూస్ పొందింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ..
“ఆగ్రాలో తాజ్ మహల్ ఉంది. పూరీకి ప్రేమ, జీవితం ఉంది. అమ్మ చాలా ప్రతిష్టాత్మకమైనా వ్యక్తిలా ఉంది. ప్రౌడ్ ఆఫ్ యు మా!” అని ఒక యూజర్ రాసుకొచ్చాడు. అది చాలా అందమైన కథ.. మీ తల్లిదండ్రులు ఎలా కలిశారో పంచుకున్నందుకు ధన్యవాదాలు” అని మరో యూజర్ కామెంట్లు పెడుతున్నారు.

Read Also : Dementia Smart Watch : వృద్ధుల్లో డిమెన్షియా.. స్మార్ట్ వాచ్‌తో ఎక్కడున్నా ఈజీగా ట్రాక్ చేయొచ్చు!

ట్రెండింగ్ వార్తలు