AP Government : ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో.. గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచేందుకు మార్గదర్శకాలు జారీ

అమ్మఒడి, గోరు ముద్ద, విద్యా కానుక తదితర పథకాల అమలు ద్వారా 2030లో సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2023-24లోనే సాధించ వచ్చని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

AP government

Government Schools : ఏపీలో 2023-24 విద్యా సంవత్సరంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచేందుకు గవర్నమెంట్ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల ద్వారా ప్రాథమిక విద్యలో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో 100.80 శాతం ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. హై స్కూలు స్థాయిలో 69 శాతానికి చేరినట్టు వెల్లడించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నాలుగేళ్లుగా ఏపీలో పాఠశాలలో చేరికలు పెరిగాయని ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలో 5 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసున్న వారంతా 1 తరగతి నుంచి 12 తరగతి వరకూ చదువుతూ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. 10 /12 తరగతులు ఫెయిల్ అయిన విద్యార్థులకు మళ్ళీ అడ్మిషన్ కల్పించి చదువుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక నుంచి ఒకే పోర్టల్ ద్వారా ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఇలా వేర్వేరు కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేసింది.

AP EAPCET : జూన్ 14న ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకూ విద్యార్ధుల డేటాను ఒకే చోట లభ్యం అయ్యేలా ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపింది. చైల్డ్ ఇన్ఫో పోర్టల్ స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ ద్వారా ఈ ప్రక్రియను చేపడతామని వెల్లడించింది. మండలాలు, జిల్లాల వారీగా గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచేందుకు కృషి చేయాలని సూచించింది.

అమ్మఒడి, గోరు ముద్ద, విద్యా కానుక తదితర పథకాల అమలు ద్వారా 2030లో సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2023-24లోనే సాధించ వచ్చని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తగిన చర్యలు చేపట్టాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్, జిల్లాల విద్యాధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు