Rain Alert : నెల్లూరు వాసులకు హెచ్చరిక…13 ఏళ్ల తర్వాత తుఫాన్ టెన్షన్

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు తీరం వెంబడి అలలు ఎగసి పడుతున్నాయి.

Heavy Rains Nellore :  నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు తీరం వెంబడి అలలు ఎగసి పడుతున్నాయి. సముద్రం ముందుకు దూసుకొచ్చింది. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో తుపాను ముప్పు పొంచి ఉండడంతో దాని ఎఫెక్ట్‌ నెల్లూరు జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి.

Read More : Chennai Rains : వణుకుతున్న తమిళనాడు, తుపాన్ కుమ్మేస్తోంది

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఈ అల్పపీడనం మరింతగా బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి 2021, నవంబర్ 11వ తేదీ గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా మారనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను నెల్లూరు సమీపంలో తీరం దాటనుంది. 2008 నవంబర్‌ 13న నెల్లూరు వద్ద ఒక తుపాను తీరాన్ని దాటింది. మళ్లీ 13 ఏళ్ల తర్వాత తుపాను నెల్లూరు వాసులను టెన్షన్ పెడుతోంది.

Read More : Not vaccinated ? : వ్యాక్సిన్ తీసుకోలేదా ? రేషన్, పెట్రోల్ కట్!

తుపాను ముప్పుతో ఇప్పటికే విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారి చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవుల అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో రెండు రోజులపాటు తీరం అల్లకల్లోలంగా ఉండనుంది. గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు