Minister Komatireddy Venkat Reddy
తెలంగాణలో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని విషయాలు బయటపడుతున్నాయని అన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు దొంగచాటుగా అమెరికా వెళ్లి వచ్చారని చెప్పారు. 26మే రోజు ఎమిరేటెస్ ఫ్లైట్ నెంబర్ ఈకే 525లో హరీశ్ రావును కేసీఆర్ అమెరికా పంపారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికే హరీశ్ రావు అమెరికా వెళ్లారని చెప్పారు.
ప్రభాకర్ రావు భారత్ కు రాకుండా ఆపేందుకే హరీశ్ ఆ దేశానికి వెళ్లివచ్చాని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ భార్యాభర్తల మాటలను కూడా విన్నారని తెలిపారు. ప్రభాకర్ రావు అప్రూవర్‌గా మారితే సమస్యలు ఎదురవుతాయని కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు.
కేసీఆర్‌కి తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని అన్నారు. రాక్షస పాలన పోయిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఉద్యమంలో కోట్ల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని అన్నారు. అసెంబ్లీకి వచ్చే మొహం కేసీఆర్‌కి లేదని చెప్పారు.
రాష్ట్ర ఏర్పాటు జరిగిన జూన్ 2నే అద్భుతమైన మెజారిటీతో గెలిచాం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి