రాష్ట్ర ఏర్పాటు జరిగిన జూన్ 2నే అద్భుతమైన మెజారిటీతో గెలిచాం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ఓట్లు వేసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

Niranjan Reddy
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ విజయం సాధించడం పట్ల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ఏర్పాటు జరిగిన జూన్ 2నే బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించిందని చెప్పారు.
ఓట్లు వేసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. తాము ఈ విజయాన్ని అమరవీరులకు అంకితం ఇస్తున్నామని చెప్పారు. నవీన కుమార్ రెడ్డికి అభినందనలు చెబుతున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయాన్ని ముందే ఊహించామని చెప్పారు. పూర్తి మెజారి బీఆర్ఎస్‌కే ఉందని అన్నారు.
గతంలో గోల్ మాల్ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవం మేరకు రేవంత్ రెడ్డి పోటీ పెట్టారని తెలిపారు. నైతికంగా సంఖ్య లేకున్నా పోటీలో నిలబెట్టారని అన్నారు. ఇప్పటికై భాషను, రాజకీయాలను మార్చుకోవాలని హితవు పలికారు. ఈ ఎన్నిక ఫలితం సీఎం రేవంత్ రెడ్డికి చెంప పెట్టని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తనకు గెలిపించినదుకు ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.