అందుకే ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి తక్కువ సీట్లు వస్తున్నట్లు ఇచ్చారు: సజ్జల

Sajjala Ramakrishna Reddy: కొన్ని ప్రాంతాల్లో పోటీ చేసినవాటి కంటే సర్వే సంస్థలు ఎక్కువ సీట్లు ఇచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Sajjala Ramakrishna Reddy

ఎగ్జిట్ పోల్స్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జాతీయ సర్వే సంస్థలు బీజేపీకి 400 సీట్లు రావాలన్న టార్గెట్‌తో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయని తెలిపారు.

కొన్ని ప్రాంతాల్లో పోటీ చేసినవాటి కంటే ఎక్కువ సీట్లు ఇచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తులో ఉండటంతో వైసీపీకి తక్కువ సీట్లు వస్తున్నట్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ స్థానిక పార్టీలకు తక్కువ సీట్లు ఇచ్చారని అన్నారు.

ఢిల్లీలో కూర్చొని తక్కువ శాంపిల్స్ తో సర్వేలు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సీరియస్‌గా చేసిన సర్వేలు చేసిన సంస్థలు వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఇచ్చాయని చెప్పారు. ఈ నెల 4న ఈ సమయానికి వాస్తవాలు బయటకి వస్తాయని తెలిపారు. సర్వేల్లో వచ్చిన ఫలితాల కంటే బెటర్‌గా వైసీపీ ఫలితాలు వస్తాయని చెప్పారు.

పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తమకు అనుకూలంగా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ ఓటింగ్ అంతా సైలెంట్ గా జరిగిందని అన్నారు. పోలింగ్ రోజు అధికారులను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబుకి తెలుసని చెప్పుకొచ్చారు.

కూటమికి క్రేజ్ లేదు.. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు ..