కూటమికి క్రేజ్ లేదు.. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు ..
ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు.

minister RK Roja
MInister Roja : ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ సంబంధం లేదు. జగన్ మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత పెద్దమొత్తంలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. అందుకే మహిళలు రాత్రికూడా పోలింగ్ కేంద్రాల వద్ద వేచిఉండి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారని రోజా అన్నారు. 2014లో కూడా ఇదే కూటమి ఉంది. కేంద్రంలో, ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రజలకు ఏమీ చేయలేదు. కూటమికి క్రేజ్ లేదు. వైసీపీనే మళ్లీ అధికారంలోకి రావటం ఖాయం. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎవరు ఎన్ని దొంగాటలు ఆడినా విజయం వైసీపీ పార్టీదేనని రోజా అన్నారు. మంత్రి రోజాతో పాటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Also Read : తెలంగాణలో పరిస్థితులు ఏపీలోనూ రావాలి : ఉండవల్లి అరుణ్ కుమార్
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ..
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే దేశంలో పేదరికం పోతుంది. షెడ్యూల్ కులాలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఐదు సంవత్సరాలు కొనసాగించారు. భారీ మెజార్టీతో వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది.. సీఎంగా జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మా అమ్మాయి కృపాలక్ష్మి గెలవాలని స్వామివారిని కోరుకున్నానని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.