తెలంగాణలో పరిస్థితులు ఏపీలోనూ రావాలి : ఉండవల్లి అరుణ్ కుమార్
అధికారంలోకి ఎవరు వచ్చినా విభజన సమస్యలపై పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

Undavalli Arun Kumar
Undavalli Arun Kumar : పోలవరం ప్రాజెక్టు ప్రారంభించి పదేళ్లయినా ఇంకా పునాదుల్లోనే ఉండిపోయింది. 48శాతం మాత్రమే ఇప్పటివరకు పూర్తయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఏపీకి విభజన చట్టంలో ఇవ్వాల్సిన హామీలేమీ పూర్తి చేయలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆదివారం పలు అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.. ఏడు సంవత్సరాలుగా కేంద్రం ఏపీకి ఇచ్చింది కేవలం 1780 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి గట్టిగా అడిగే నాధుడు లేడు. ఆంధ్రాకు కావలసిన తాగు, సాగునీరు అవసరాలను కేంద్రం పట్టించుకోవడం లేదు. నాగార్జునసాగర్ పులిచింతల శ్రీశైలం వద్ద ఈ విషయంపై గొడవ జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సంప్రదించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
Aolso Read : సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్.. ఏమన్నారంటే?
ఏపీ పరిస్థితి ఏం బాగోలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. రాష్ట్ర ప్రయోజనాలను మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఉండవల్లి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఇచ్చిన మాటకోసం అధికారం పోగొట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కేంద్రం నుంచి విభజన చట్టం ద్వారా ఒక లక్ష 42,600 కోట్లు మనకు రావాలి.. పోలవరం ప్రాజెక్టుపై కొట్లాడడానికి నా ఓపిక సరిపోవడం లేదు. అధికారంలోకి ఎవరు వచ్చినా విభజన సమస్యలపై పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీలో పరిస్థితులు ఏం బాగోలేదు. తెలంగాణలో శాసనసభ సమావేశాలు చాలా హుందాగా జరుగుతున్నాయి. ఏపీలో కూడా అటువంటి పరిస్థితి రావాలని బలంగా కోరుకుంటున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.