Heavy Rains : ఏపీలో భారీ వర్షాలు…మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులు

సీఎం జగన్ ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష జరిపారు.

Heavy Rains In AP : ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో.. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. చెన్నైకి సమీపంలో వాయుగండం తీరాన్ని తాకే అవకాశముంది. దీంతో 2021, నవంబర్ 19వ తేదీ శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో సీఎం జగన్ ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. 1. నెల్లూరుకు సీనియర్ అధికారి రాజశేఖర్. 2. చిత్తూరుకు ప్రద్యుమ్నా. 3. కడపకు సీనియర్ అధికారి శశిభూషణ్ లను నియమించారు.

Read More : New Farm Laws : వ్యవసాయ చట్టాలు రద్దు…ఇది రైతు విజయం

మరోవైపు…

కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కడప జిల్లాలో రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టును ప్రమాదం పొంచి ఉంది. పింఛా ప్రాజెక్టు రింగ్ బండ్ తెగిపోవడంతో ఊహకు అందని స్థాయిలో అన్నమయ్య ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు అధికారులు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో వర్షాలకు సోమశిల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. జలాశయం 11 గేట్లు ఎత్తి పెన్నానదికి నీటిని విడుదల చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు