Heavy Rains : ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Heavy Rains (1)

AP Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురువనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ (సోమవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు (సోమవారం) అల్లూరి, ఏలూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మరో 17 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Telangana Rains : భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలంగాణలో రానున్న 5 రోజులు వానలు

పార్వతీపురం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, తూ.గో, ప.గో, కోనసీమ, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది.

ట్రెండింగ్ వార్తలు