Janasena pawan kalyan : జనసేన ప్రాథమిక లక్ష్యం నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ : పవన్ కల్యాణ్

జనసేన ప్రాథమిక లక్ష్యం నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చాలామంది నేతలు బాధ్యతగా వ్యవహరించటంలేదని ఆరోపించిన పవన్ అటువంటి నేతల మెడలు వంచి ప్రజలకు సమాధానాలు చెప్పిస్తామన్నారు.

Janasena pawan kalyan : జనసేన ప్రాథమిక లక్ష్యం నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చాలామంది నేతలు బాధ్యతగా వ్యవహరించటంలేదని ఆరోపించిన పవన్ అటువంటి నేతల మెడలు వంచి ప్రజలకు సమాధానాలు చెప్పిస్తామన్నారు. ఈ సందర్భంగా పొత్తులపై కూడా పవన్ మాట్లాడారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? ఏ సందర్భానికి ఎలా వ్యవహరించాలి అనేదానిపై నాకు స్పష్టత ఉందని పొత్తుల గురించి నా కారణాలు నాకున్నాయని సందర్భాన్ని బట్టి పవన్ మారిపోతారంటూ వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

అసరానికి ఎజెండా మార్చేస్తానని నాపై విమర్శలు వస్తున్నాయని..అవును ఎందుకంటే నా ప్రజల అవసరాల కోసం నేను మారుతుంటానని సమస్యలు కొత్త రూపాల్లో వస్తున్నప్పుడు మారటంలో తప్పులేదన్నారు. మార్పు అనేది అనివార్యం అని ఆయా సమస్యలను బట్టి వాటి పరిష్కారాలకు మార్పు అవసరం అని అన్నారు. నేను మార్కిస్ట్,కమ్యూనిస్టును కాదు హ్యూమనిస్టును అని స్పష్టంచేశారు పవన్ కల్యాణ్. వామపక్ష భావం జాలం అనేది ప్రస్తుత కాలంలో పనిచేయటంలేదని కానీ సమస్యల్ని పరిష్కరించాలంటే కొన్ని విషయాల్లో దూకుడు అవసరం అని అన్నారు.

అధికారం నాకు ముఖ్యం కాదు అంటూ పదే పదే చెప్పే పవన్ మరోసారి సీఎం పదవి గురించి మాట్లాడుతూ..ఇప్పటికిప్పుడు సీఎం కావాలని అనుకోవటంలేదని ప్రజల అభీష్టం ఉంటే సీఎం అవుతానని అన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న అరాచక పాలన పోవాల్సిన అవసరం చాలా ఉందని లేదంటే ఏపీ అంధకారం అయిపోతుందని యువతకు భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుందని కాబట్టి పాలన మారాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఏపీ ప్రజలు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో జీవించే పాలన అవసరమన్నారు. ప్రస్తుం వైసీపీ పాలనలో అటువంటి పరిస్థితి లేదని కాబట్టి ప్రజలకు ఉద్యోగ..ఉపాధి కల్పించే పాలన అవసరం అని అలా జరిగితేనే ఏపీ అభివృద్దిలో ముందుకు వెళుతుందని అన్నారు పవన్ కల్యాణ్.

కాగా.. భారతదేశం 74వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు