Tirumala Ghat Roads : తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలించిన కేరళ నిపుణుల బృందం

తిరుమల రెండవ ఘాట్‌ రోడ్ లో కొండచరియల విరిగిపడ్డ ప్రాంతాలను కేరళ అమృతా విశ్వవిద్యాలయం నిపుణుల బృందం పరిశీలించింది.

Tirumala Ghat Roads : తిరుమల రెండవ ఘాట్‌ రోడ్ లో కొండచరియల విరిగిపడ్డ ప్రాంతాలను కేరళ అమృతా విశ్వవిద్యాలయం నిపుణుల బృందం పరిశీలించింది. ఈ బృందంలో పలువురు ప్రొఫెసర్లు ఉన్నారు. వారు అమృతా విశ్వవిద్యాలయంలో వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్‌ స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్ అంతర్జాతీయ ప్రోగ్రామ్ చేస్తున్నారు. కొండచరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం కేరళ ప్రొఫెసర్లను టీటీడీ ఆహ్వానించింది.

Komaki Ranger : కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు

కొండ‌చ‌రియ‌లు విరిగిపడ్డ ప్రాంతంలో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు, భ‌విష్య‌త్తులో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా అత్యాధునిక శాస్త్ర ప‌రిజ్ఞానంతో స‌ర్వే చేసి టీటీడీకి కేరళ ప్రొఫెసర్లు నివేదిక అందించనున్నారు. తనిఖీల్లో పాల్గొన్న బృందంలో అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి చెందిన నిపుణులు ప్రొఫెసర్ మనీషా, ప్రొఫెసర్ నిర్మల వాసుదేవన్, ప్రొఫెసర్ సుదేష్ విద్వాన్ ఉన్నారు.

iPhone 12 Pro : అమెజాన్‌ బిగ్ డీల్.. ఐఫోన్ 12ప్రోపై రూ.25వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్!

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల రెండో ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. టన్నుల బరువున్న పెద్ద పెద్ద బండరాళ్లు పైనుంచి పడటంతో రోడ్డు, రక్షణ గోడలు ధ్వంసం అయ్యాయి. రహదారి మూడు చోట్ల పాక్షికంగా ధ్వంసమైంది. దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. కాగా, భవిష్యత్తులో కొండచరియలు విరిగి పడకుండా చూసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐఐటీ నిపుణులు బృందాన్ని తిరుమలకు పిలిపించింది. వారి సలహాలు, సూచనలు తీసుకుంటోంది. కాగా, తిరుమలకు ప్రత్యామ్నాయ రహదారి ఉంటే మంచిదని నిపుణుల బృందం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు