Dadisetti Raja : పేర్ని నాని ఇంట్లో చెప్పులు,డ్రాయర్లు దోచేశారట,అతను కాకినాడలో తిరుగుతున్నాడట : పవన్‌కు మంత్రి దాడిశెట్టి కౌంటర్

నలభై ఐదు గుళ్ళు విజయవాడలో కూలగొడితే నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు? పవన్ కళ్యాణ్ బాబా అవతారం ఎత్తి అమరావతి కోసం మాట్లాడతాడు అతడిని సైక్రియాటిస్ట్ గ్గరకు తీసుకువెళ్తే బాగుంటుంది.

Minister Dasshetty Raja ..Pawan Kalyan

Minister Dadisetti Raja : పేర్ని నాని (Perni Nani)ఇంట్లో ఎవరో చెప్పులు డ్రాయర్లు దోచేశారట. అ వ్యక్తి కాకినాడ (Kakinada)జిల్లాలో లారీ ఎక్కి తిరుగుతున్నాడు అంటూ మంత్రి దాడిశెట్టి రాజా (Minister Dadisetti Raja) పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. తునిలో మంత్రి దాడిశెట్టి మాట్లాడతు.. నలభై ఐదు గుళ్ళు విజయవాడ (Vijayawada)లో కూలగొడితే నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు ? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. పవన్ మాటలకు పొంతన ఉండదని..కులాలు,మతాల కోసం మాట్లాడతాడు అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ బాబా అవతారం ఎత్తి అమరావతి కోసం మాట్లాడతాడు అతడిని సైక్రియాటిస్ట్ (Psychiatrist)దగ్గరకు తీసుకువెళ్తే బాగుంటుంది అంటూ ఎద్దేవా చేశారు.

Perni Nani : పవన్ కల్యాణ్‌కు రెండు చెప్పులు చూపించిన పేర్ని నాని .. నీకంటే పెద్ద మగాడిని అంటూ ఘాటు వ్యాఖ్యలు

గంట గంటకు కలలు గని రకరకాలుగా మాట్లాడతాడంటూ సెటైర్లు వేశారు. పవన్ మాటలకు క్లారిటీ ఉందా?అంటూ ప్రశ్నించారు. వారాహి యాత్ర (Varahi Yatra) రెండు సభలు ఫెయిల్ అయ్యాయని తన సభలకు జనం రాకపోతే నీ యాజమాని ప్యాకేజ్ ఇవ్వడు అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విరుచుపడ్డారు. సీఎం అయిపోవాలని నువ్వు డిసైడ్ అయిపోతే ప్రజలు ఒప్పుకోవాలి కదా?నువ్వు ఎక్కడ పోటీ చేయాలో ? నీ యాజమాని నిర్ణయించాలి కదా? నన్ను గెలిపించండి అని పవన్ అడుక్కుంటున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. పవన్ ఎమ్మెల్యే అవ్వాలన్నా…ముఖ్యమంత్రి అవ్వాలన్న ప్రజలు ఓట్లు వెయ్యాలి కదా? అంటూ సెటైర్లు వేశారు.

Pawan Kalyan: నా రెండు చెప్పులు కొట్టేశారు, ఎవరో దొంగిలించారు: పవన్ కామెంట్స్

కాగా.. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర (Varahi Yatra)లో వైసీపీ నేతలపై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పవన్ చేసే విమర్శలకు వైసీపీ నేతలు కూడా అదే రేంజ్ లో ప్రతివిమర్శలు చేస్తున్నారు. పవన్ వారాహి యాత్ర (Pawan Varahi Yatra)లో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తు తాను గుడికి వెళితే తన రెండు చెప్పులు కొట్టేశారని, ఎవరో దొంగిలించారని వ్యాఖ్యానించారు. ఎవరికైనా కనిపిస్తే పట్టుకోండని, తన చెప్పులు తనకు ఇప్పిచండి ప్లీజ్ అని అన్నారు. వైసీపీ (YCP) ప్రభుత్వం గుడిలో తన చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోతోంది అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి దాడిశెట్టి రాజా పేర్ని నాని ఇంట్లో ఎవరో చెప్పులు డ్రాయర్లు దోచేశారట. అ వ్యక్తి కాకినాడ జిల్లాలో లారీ ఎక్కి తిరుగుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు. ఇలా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు వైసీపీ నేతలకు మధ్య చెప్పుల మాటల యుద్దాలు నడుస్తున్నాయి.







                                    

ట్రెండింగ్ వార్తలు