Bank Fraud: చిరు వ్యాపారులను ముంచేసిన ముద్ర అగ్రికల్చర్ ప్రైవేట్ బ్యాంక్

టీ స్టాల్, టిఫిన్ సెంటర్, ఇస్త్రీ బండి లాంటి చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకుని ముద్ర అగ్రికల్చర్ ప్రైవేట్ బ్యాంక్ దారుణమైన మోసానికి పాల్పడింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేయడంతో.

Bank Fraud: టీ స్టాల్, టిఫిన్ సెంటర్, ఇస్త్రీ బండి లాంటి చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకుని ముద్ర అగ్రికల్చర్ ప్రైవేట్ బ్యాంక్ దారుణమైన మోసానికి పాల్పడింది. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులోని బ్యాంకు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. దీంతో డబ్బు సేవింగ్ చేసుకుని మెచ్యూరిటీ అమౌంట్ తీసుకుందామని వచ్చిన కస్టమర్లు లబోదిబోమంటున్నారు.

అమౌంట్ సేవ్ చేస్తే ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసింది ముద్ర బ్యాంక్. నిర్ణీత గడువు తేదీ తర్వాత మెచ్యూర్డ్ అమౌంట్ అడగడానికి వెళ్లారు. అక్కడ ఆఫీస్ బిల్డింగ్ కు టూలెట్ బోర్డు తగిలించి ఉండటంతో అది చూసిన బాధితులు షాక్ అయ్యారు.

బాధితులంతా చిరు వ్యాపారులే కావడం గమనార్హం. వారందరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదని ఏజెంట్లు ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిపించడం మానేశారంటూ వాపోతున్నారు.

Yes Bank: రూ.300కోట్ల మోసం కేసు నిందితుడికి బెయిల్

సిబ్బంది, మేనేజ్మెంట్, సిబ్బంది ఎవరు కనబడడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము చెల్లించిన అమౌంట్ తిరిగి ఇప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు