Nannapaneni Rajakumari : మీకు ఇక్కడేం పని అంటారా.. చంద్రబాబుపై కేటీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: నన్నపనేని రాజకుమారి డిమాండ్

కోర్టులను ప్రభావితం చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ చేష్టలను జలు అసహించుకుంటున్నారు. Nannapaneni Rajakumari

Nannapaneni Rajakumari - Chandrababu Arrest (Photo : Google)

Nannapaneni Rajakumari – Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి తీవ్రంగా స్పందించారు. జగన్ సర్కార్ పై ఆమె నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం చేష్టలను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

కోర్టులను ప్రభావితం చేసి బెయిల్ రాకుండా ప్రయత్నాలు:
”రాష్ట్రంలో మానవత్వం, స్వేచ్చా స్వాతంత్ర్యాలు నశించిపోయాయి. ఏపీలో నియంత పాలన నడుస్తోంది. కోర్టులను ప్రభావితం చేసి బెదిరించి చంద్రబాబుకు బెయిల్ రాకుండా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబును దోషిగా నిరూపించకుండా నిర్దోషిగా తేల్చకుండా జైల్లోనే నిర్బంధించి కాలం గడుపుతున్నారు. ఎంతకాలం ఇలాగే నిర్బంధిస్తారు. ప్రభుత్వ చేష్టలను చూసి ప్రజలు అసహించుకుంటున్నారు.

త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారు:
నందమూరి కుటుంబం కుంగిపోలేదు. మనోధైర్యంతో ఉంది. ఉన్నారు. త్వరలోనే నందమూరి కుటుంబమంతా ప్రజల్లోకి వస్తారు. ఎన్నికలు కూడా ఎంతో దూరం లేవు. ఉన్నట్లుండి మీటింగ్ పెట్టి ప్రజల్లోకి వెళ్లండని నాయకులకు సీఎం జగన్ నిర్దేశిస్తున్నారు. గడపగడపకు పోయి ప్రజల తలుపులు తడితే ఏమవుతుందో మీరే చూస్తారు. నేను చెప్పను. త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారు. లోకేశ్ త్వరలోనే యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు.(Nannapaneni Rajakumari)

Also Read..Chandrababu: అచ్చెన్నాయుడి ప్రకటన.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారా.. బాబు స్కెచ్ ఏంటో?

కేటీఆర్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు:
చంద్రబాబును అరెస్ట్ చేస్తే మీరు కూడా ఆయనను గౌరవిస్తున్నామంటున్న మీకు ఇక్కడేం పని అనే పదాలు వాడటం కేటీఆర్ కు ఎంతవరకు సమంజసం? సమైక్యాంధ్రలో తెలంగాణకు చంద్రబాబు ఎంతో సేవ చేశారు. అన్నిటికంటే తెలుగు జాతి మొత్తం ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ దీక్షలు, ర్యాలీలు సాగుతున్నాయి.

తెలుగువారంతా ఒక్కటే అన్నారు, ఇప్పుడేమైంది కేటీఆర్?
స్టీల్ ప్లాంట్ మీరు కొంటామన్నారు. మీరు ఏ విధంగా ఇక్కడ సీఎం జగన్ తో అవగాహన కుదుర్చుకున్నారు. తెలంగాణకు చెందినవారమంటున్న మీరు విశాఖ ఉక్కు పరిశ్రమను మీరు ఎలా కొంటారు. తెలుగు వారమైన మనం విడిపోయినంత మాత్రాన మనమందరం ఒక్కటే అన్న కేటీఆర్, కేసీఆర్ లు ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సబబు. ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ ఆక్షేపణ చేయని అభ్యంతరాన్ని మీరు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు భారీగా ఇమేజ్ పెరుగుతుందని భయపడ్డారా? చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఒక క్యాడ్ గుర్తింపు ఉన్న టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడనే విషయాన్ని గుర్తించుకోవాలి.

Also Read..TDP: తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య.. క్లిష్ట పరిస్థితులను టీడీపీ ఎలా ఎదుర్కొబోతోంది.. బాలకృష్ణ వల్ల అవుతుందా?

చంద్రబాబుకి కేటీఆర్ మద్దతు ప్రకటించాలి:
అదే విధంగా బీఆర్ఎస్ పార్టీగా జాతీయ పార్టీగా చేసి ఏపీలో కూడా ఇద్దరు నేతలను పెట్టారు. మహారాష్ట్రకు వెళ్లి ధర్నా చేసిన మీరు ఆ విధంగా ఎలా చెబుతారు? దేశంలో ఎక్కడైనా నిరసన తెలిపే హక్కు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఒక తెలుగు నాయకుడికి ఈ పరిస్థితి వస్తే మానవత్వం చూపించాల్సింది పోయి మీకేం పని ఇక్కడ అంటూ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని చంద్రబాబుకు మద్దతు ప్రకటించాలి. కేటీఆర్ కు మంచి భవిష్యత్తు ఉంది. మంచి నాయకుడైన నీవు ఇటువంటి సంకుచిత భావాలు మాట్లాడటం కరెక్ట్ కాదు.

చంద్రబాబు పడిలేచే కెరటం:
తెలంగాణలో ఉద్యమాలు చేస్తున్న షర్మిలను కాంగ్రెస్ పార్టీ ఏపీలో దింపాలని చూస్తుంది. ఏమిటీ రాజకీయాలు? దోషిగా నిరూపించలేకపోయిన మీరు రేపు తలుపు తట్టి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచానికి ఏం సమాధానం చెప్తారు. చంద్రబాబు ఎగిసిపడే కెరటం కాదు. పడిలేచే కెరటం. ఇలాంటి ఒడిదొడుకులు ఆటు పోట్లు తిని సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డారు. వైజాగ్ ప్రజలు మాకు రాజధాని వద్దంటున్నారు. సీఎం జగన్ మాత్రమే బలవంతంగా రుద్దుతున్నారు.

Also Read..KTR: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన కేటీఆర్.. మాకేం సంబంధం.. హైదరాబాద్ లో ర్యాలీలు ఎందుకు?

మీ నాన్న వల్లే కాదు.. నీ వల్ల అవుతుందా జగన్?
టీడీపీ పార్టీ గెలుపు ఖాయం కావడంతోనే ఏం చేయాలో పాలుపోక జగన్ ఇటువంటి కక్ష సాధింపులకు దిగారు. రోజాను కేవలం తిట్టడానికి మంత్రిగా పెట్టుకున్నారా..? మీ నాన్నే నిరూపించలేకపోయాడు. నీ వల్ల ఏమవుతుందని మేము సూటిగా జగన్ ను అడుగుతున్నాం” అని నన్నపనేని రాజకుమారి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు