AP Current : బాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెరగలేదు… ఆయనే విజనరీ కారణం

బాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెరగలేదని..ఇందుకు ఆయన విజనరీ కారణమని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వెల్లడించారు. ఐదు సంవత్సరాల్లో విద్యుత్ చార్జీలు పెంచలేదని...

Nara Lokesh : బాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెరగలేదని..ఇందుకు ఆయన విజనరీ కారణమని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వెల్లడించారు. ఐదు సంవత్సరాల్లో విద్యుత్ చార్జీలు పెంచలేదని, నూతన విధానాలను తీసుకొచ్చి మిగులు విద్యుత్ గా నిలిపిన  ఘనత బాబుకే దక్కుతుందన్నారు. ఈఆర్సీ క్లియర్ గా ఇచ్చి… జీవో ఇచ్చిన తర్వాత.. ప్రతిపాదనలు అంటారామేటీ ? అని సూటిగా ప్రశ్నించారు. అలా అయితే.. పెంచిన చార్జీల ప్రతిపాదనలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం పెంచిన చార్జీలపై టీడీపీ నిరసన తెలుపుతోంది. 2022, మార్చి 31వ తేదీ గురువారం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు.

Read More : AP Electricity Charges : ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీల పెంపు.. ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్

సోలార్ విండ్ ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేసుంటే.. ఒక రూపాయి చార్జీ తక్కువ చేసే అవకాశం ఉండేదన్నారు. ఓపెన్ మార్కెట్ లో విద్యుత్ ను విచ్చలవిడిగా కొంటున్నారని.. ఈ పరిస్థితికి కారకులు సీఎం జగన్ అని, ఇది అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. రాత్రి వేళ కరెంటు వాడొద్దని ప్రజలు భావిస్తున్నారని, ఇక లాంతరే దిక్కు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో విద్యుత్ కొరత ఉండేదని బాబు సీఎం అయిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. ఏపీలో విద్యుత్ లోటుంది అంటున్నారు..ఎందుకు ఉన్నారు సీఎంగా, విద్యుత్ శాఖ మంత్రిగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు.

Read More : Electricity Charges : తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్

విద్యుత్ విషయంలో బాబు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ప్రభుత్వానికి స్వేచ్చ ఉంటే.. అన్ని విషయాలపై మాట్లాడాల్సి ఉంటుందన్నారు. ప్రజా సమస్యలు ఎప్పుడైనా తెలుసుకున్నారా ? అంటూ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. మంత్రి బోత్స సత్యనారాయణకు తెలివి తక్కువ అయిపోతోందని, మంత్రి పదవి పోతోందనే భయం ఆయనలో ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కుంభకోణాలు జరిగినట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారని, నిరూపించాలని సవాల్ విసిరారు. పాదయాత్రలో 600 హామీలు గుప్పించారని ఆ విషయాన్ని తాము పదే పదే ప్రస్తావిస్తున్నట్లు.. కానీ అలాంటి హామీలు ఇవ్వలేదని వైసీపీ చెబుతోందని నారా లోకేశ్ విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు