Andhra Pradesh : మంత్రులను మార్చటం ఎందుకు..? జగన్‌నే మార్చితే సరిపోతుందిగా : నారా లోకేశ్

సీఎం జగన్ మంత్రులను మారుస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. మరోసారి మంత్రులను మారుస్తానని జగన్ అంటున్నారు. అన్నిసార్లు మంత్రులను మార్చటం ఎందుకు? జగన్‌నే మార్చేస్తే సరిపోతుందిగా అంటూ సెటైర్ వేశారు.

Andhra Pradesh : ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇవ్వట్లేదంటూ సీఎం జగన్ మంత్రులపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపైనా.. తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసినా స్పందించరా? ప్రతిపక్షాలకు కౌంటర్స్ ఇస్తారా? లేదా మిమ్మల్నే మార్చేయాలా? అంటూ అత్యంత ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఎదురు సమాధానం చెప్పకపోతే మీరెందుకు? మీకు మంత్రి పదవులు ఎందుకు? అంటూ మంత్రులను కేబినెట్ మీటింగ్ లో కడిగిపారేశారు. మీరు ఇలాగే ఉంటే మరోసారి కేబినెట్ లో మార్పులు చేయాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.

సీఎం జగన్ మంత్రులను మారుస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు. సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. మరోసారి మంత్రులను మారుస్తానని జగన్ అంటున్నారు. అన్నిసార్లు మంత్రులను మార్చటం ఎందుకు? జగన్ నే మార్చేస్తే సరిపోతుందిగా అంటూ సెటైర్ వేశారు.

కాగా బుధవారం (సెప్టెంబర్ 7,2022) ఏపీ కేబినెట్‌ సమావేశమైంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న వార్త కన్నా… ఆ సమావేశంలో సీఎం జగన్ సీరియస్ అయ్యారన్న వార్తే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఏపీలో విపక్షాలు దూకుడు పెంచి జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ.. ఇట్నుంచి ఆ స్థాయిలో కౌంటర్‌లు పడడం లేదు. ప్రధానంగా దీనిపైనే జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రులు తీరు మార్చుకోవాలని గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారట.

కేబినెట్‌ సమావేశంలో సీఎం జగన్ మంత్రులపై సీరియస్ అయ్యారన్న వార్త ఇప్పుడు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొంతకాలంగా లిక్కర్ స్కామ్‌తో సహా పలు అంశాలపై దూకుడుగా వెళ్తున్న విపక్షాలు.. సీఎం జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులే టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. మంత్రులు, ఇతర నేతల నుంచి ఆ స్థాయిలో విపక్షాల ఆరోపణలకు కౌంటర్‌లు పడడం లేదన్న అసహనం జగన్‌లో ఉంది. అదే కేబినెట్‌ సమావేశంలో బయటపడింది. విపక్షాల నుంచి వచ్చే ఆరోపణలు ఖండించకపోతే.. మీకెందుకీ మంత్రి పదవులు అని నేరుగా జగన్ నిలదీసినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని మంత్రులు బయటకు చెప్పుకోలేక నానా పాట్లు పడుతున్నారట.

Also read : CM Jagan Warned Ministers : కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేయమంటారా?

కేబినెట్‌ సమావేశం ప్రారంభమయ్యాక ముందు బాగానే నడిచింది. పలు అంశాలపై చర్చ జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆ సమయంలో మొదలైంది సీఎం క్లాస్… ఒక్కసారిగా కాస్త టోన్‌ మార్చడంతో మంత్రులు షాక్‌కు గురయ్యారు. జగన్‌ అండ్‌ ఫ్యామిలీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సమావేశంలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. ప్రతిపక్షాల ఆరోపణలకు ఎందుకు కౌంటర్‌ ఇవ్వట్లేదంటూ మంత్రులపై ఫైర్‌ అయ్యారు సీఎం. విపక్ష నేతలు నా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసినా కూడా స్పందించరా అని నిలదీశారు. నిత్యం ప్రభుత్వంపై బురద జల్లుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారని గట్టిగా ప్రశ్నించారు సీఎం. జగన్ ప్రశ్నలకు మంత్రులెవరూ సమాధానం చెప్పలేకపోయారు.

కనీసం విపక్ష నేతల ఆరోపణలను ఖండించకపోతే మీకు పదవులు ఎందుకు అని జగన్‌ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అప్పటికే షాక్‌ తిన్న మంత్రులను ఆ తర్వాత సీఎం చేసిన కామెంట్స్ మరింత బెంబేలెత్తించాయి. మరోసారి కేబినెట్‌లో మార్పులు చేయమంటారా అంటూ మినిస్టర్స్‌కు ఝలక్‌ ఇచ్చారట. ఇంకోసారి కేబినెట్ రీషఫుల్ చేయమంటారా అంటూ మంత్రులను సూటిగా ప్రశ్నించారట. సీఎం జగన్ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. భావోద్వేగానికి కూడా గురయ్యారు.

ఇటీవల సీఎం సతీమణి వైఎస్‌ భారతిపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. లిక్కర్ స్కామ్‌లో ఆమె హస్తముందని టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ అంశంపై మంత్రి ఉషా శ్రీచరణ్‌, వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణి మినహా ఎవరూ పెద్దగా స్పందిచలేదు. దీంతో టీడీపీ నేతలు చేసిన నిరాధార ఆరోపణలను మంత్రులు ఎందుకు ఖండించలేదని సీఎం జగన్ ఫైర్‌ అయ్యారు. సీఎం కుటుంబంపై ఆరోపణలు చేస్తే మాకేం పట్టిందిలే అన్నట్టు వ్యవహరించారంటూ భావోద్వేగానికి గురయ్యారట జగన్. దీంతో.. ఇకపై అలా జరగదని.. తమ పవర్ ఏంటో చూపిస్తామని కేబినెట్ భేటీలో మంత్రులు హామీ ఇచ్చారంటున్నారు.దీనికి నిదర్శనంగా మంత్రులు తమ నోటికి పనికల్పించారు. టీడీపీపై విరుచుకుపడుతున్నారు. దీంతో జగన్ రెడ్డి వార్నింగ్ మంత్రులపై బాగానే పనిచేసినట్లుగా కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు