Nara Lokesh : పోసాని కృష్ణమురళిపై పరువు నష్టం కేసు వేసిన నారా లోకేశ్

పోసాని కృష్ణమురళీపై మంగళగిరి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. పోసానితో పాటు సింగలూరు శాంతి ప్రసాద్ పై కూడా లోకేశ్ కేసు దాఖలు చేశారు.

NARA lokesh posani krishna murali

NARA lokesh- posani krishna murali : టీడీపీ నేత నారా లోకేష్ (NARA lokesh)మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. నటుడు,ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళీ(posani krishna murali)పై మంగళగిరి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. పోసానితో పాటు సింగలూరు శాంతి ప్రసాద్ పై కూడా లోకేశ్ కేసు దాఖలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పిటీషన్ లో పేర్కొన్నారు. పాదయాత్రకు చిన్నపాటి విరామం ఇచ్చిన లోకేశ్ ఈరోజు మంగళగిరి కోర్టు( mangalagiri court )కు వచ్చి పిటీషన్ దాఖలు చేశారు.

పోసాని కృష్ణమురళితోపాటు సింగలూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తి కూడా తనపై బురద జల్లేందుకు నిరాధార ఆరోపణలు చేశారని లోకేశ్ ఆరోపించారు. ఈక్రమంలో సింగలూరు శాంతి ప్రసాద్, పోసాని కృష్ణమురళిలపై వేర్వేరుగా మంగళగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లో వాంగ్మూలం నమోదు కోసం శుక్రవారం (ఆగస్టు 18,2023) మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టుకి లోకేశ్ చేరుకున్న లోకేశ్ పిటీషన్ వేశారు.

Vijayawada: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. అవినాష్ ఇంటికి సీఎం జగన్

ఓ యూట్యూబ్ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి లోకేశ్‌పై సంచలన ఆరోపణలు చేసిన క్రమంలో లోకేశ్ భూములు కొనుగోలు చేశారని పేర్కొన్న క్రమంలో ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని..అటువంటి ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని తన న్యాయవాది ద్వారా పోసానికి నోటీసులు పంపారు. అయినా పోసాని స్పందించకపోవటంతో మంగళగిరి కోర్టులో పరువు నష్టం కేసు వేసినట్లుగా తెలుస్తోంది.

అలాగే ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సింగలూరి శాంతి ప్రసాద్ కూడా తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినా స్పందించకపోవటంతో శాంతి ప్ర‌సాద్‌పై చర్యలు తీసుకోవాలంటూ పిటీషన్ లో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు