Omicron variant: విదేశాల నుంచి ఆంధ్రాకు వచ్చిన 30మంది మిస్సింగ్

దేశాల నుంచి ఆంధ్రాకు వచ్చిన 30మంది కనబడకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ వెదుకులాట మొదలుపెట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీయులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు

Omicron variant: విదేశాల నుంచి ఆంధ్రాకు వచ్చిన 30మంది కనబడకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ వెదుకులాట మొదలుపెట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీయులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే విదేశాల నుంచి వచ్చిన 60మందిలో కేవలం 30మందికి మాత్రమే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు జరిపారు.

విశాఖపట్నంతో పాటు పలు ఎయిర్‌పోర్టుల్లో దిగిన వారిలో 30మంది మాత్రమే విశాఖపట్నంలో ఉన్నారు. మిగిలిన 30మంది రాష్ట్రంలో పలు చోట్లకు వెళ్లిపోయారు. మిగిలిన వారు ఫోన్ కాల్స్‌కు కూడా ఆన్సర్ చేయడం లేదు.

ఈ మేరకు విశాఖపట్నం జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇతర జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసి 30మంది విదేశాల నుంచి వచ్చిన వారి గురించి ఆరా తీయాలని పిలుపునిచ్చింది. వారిలో ముగ్గురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారు కాగా, ఆరుగురు బొత్సవానా నుంచి సిటీకి వచ్చిన వారి గురించి తెలిసింది. ఇంకా బొత్సవానా నంచి వచ్చిన ఇద్దరు, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒకరి గురించి తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తులు కృష్ణా జిల్లాలోని పలు గ్రామలకు వెళ్లినట్లుగా తెలిసింది.

………………………………………: బాలీవుడ్ నటిపై దుండగుల దాడి… బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది

ఒమిక్రాన్ భయంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టుల్లో ప్యాసింజర్లకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. 10రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారి గురించి తెలుసుకున్నారు. తొమ్మిది మంది ఆఫ్రికా నుంచి రాగా వారంతా నేరుగా విశాఖపట్నంలోనే ల్యాండ్ అవలేదు. పలు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల నుంచి వైజాగ్ చేసుకున్నారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించే ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

అయినప్పటికీ మరోసారి టెస్టులు నిర్వహించి ఒమిక్రాన్ కేసులు నమోదు కాకుండా ఉండాలని జాగ్రత్త తీసుకుంటున్నామని.. చెబుతున్నారు. విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ.. విదేశాల నుంచి వచ్చిన ఏ వ్యక్తికి పాజిటివ్ గా తేలలేదని అన్నారు.

…………………………………….: పూజ పాత్రకి విషాదాంతం.. అప్డేట్స్ ఏం చెప్తున్నాయ్?

ట్రెండింగ్ వార్తలు