Pawan Kalyan Varahi Yatra: కత్తిపూడిలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తొలి బహిరంగ సభ.. పూర్తి షెడ్యూల్ ఇదే..

ఈనెల 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభంకు ముందు ఉదయం 9గంటలకు పవన్ కళ్యాణ్ అన్నవరంలోని సత్యదేవుని దర్శనం చేసుకుంటారు. వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు.

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ నెల 14నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో తొలిదశ పవన్ పర్యటన సాగుతుంది. ఈ సందర్భంగా ఏడు ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. పవన్ తొలి బహిరంగ సభ కాకినాడ జిల్లా పరిధిలోని కత్తిపూడి జంక్షన్ వద్ద జరగనుంది. బహిరంగ సభలకు సంబంధించి జనసేన పార్టీ అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది.

Pawan kalyan Varahi Yatra : జూన్ 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. అన్నవరంలో యాత్రకు శ్రీకారం..

వారాహి యాత్ర బహిరంగ సభల షెడ్యూల్ ఇలా..

14 జూన్ 2023 – కత్తిపూడి సభ
16 జూన్ 2023 – పిఠాపురంలో వారాహి యాత్ర,  సభ
18 జూన్ 2023 – కాకినాడలో వారాహి యాత్ర, సభ
20 జూన్ 2023 – ముమ్మిడివరంలో వారాహి యాత్ర, సభ
21 జూన్ 2023 – అమలాపురంలో వారాహి యాత్ర, సభ
22 జూన్ 2023 – పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర మలికిపురంలో సభ
23 జూన్ 2023 – నరసాపురంలో వారాహి యాత్ర, సభ

Pawan Kalyan : పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఆటంకం..

ఈనెల 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభంకు ముందు ఉదయం 9గంటలకు పవన్ కళ్యాణ్ అన్నవరంలోని సత్యదేవుని దర్శనం చేసుకుంటారు. వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4గంటలకు వారాహి యాత్ర  కాకినాడ జిల్లాలో ప్రారంభమవుతుంది. సాయంత్రం 5గంటలకు కత్తిపూడి కూడలిలో బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. సాయంత్రం 6గంటలకు పిఠాపురం నియోజకవర్గం చేరుకొని అక్కడ బస చేస్తారు. తొలిదశ యాత్ర ఈనెల 23వ తేదీ వరకు కొనసాగుతుంది.

ట్రెండింగ్ వార్తలు