Ketireddy Peddareddy : జేసీ ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..

తాడిపత్రిలో మళ్లీ అలజడులు సృష్టించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మా అనుచరులను టార్గెట్ చేశారు. ఇలాంటి వాటికి భయపడేది లేదు.

kethireddy pedda reddy

Ketireddy Peddareddy : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం అనంతపురంలో విలేకరులతో పెద్దారెడ్డి మాట్లాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదు.. ఆయన నన్ను తాడిపత్రిలోకి రానివ్వనన్నారు. నాకు కుటుంబం ఉన్నట్లే.. జేసీకి కూడా కుటుంబం ఉంది. ఆయన వాహనాలపై అక్రమ కేసులు నేను పెట్టించలేదు. అవి అధికారులు నమోదు చేశారు. ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. అతను తప్పు చేశాడా.. లేదా అన్నది నిరూపించుకోవాలని పెద్దారెడ్డి అన్నారు.

Also Read : తాడిపత్రి మున్సిపాలిటీలో ఆసక్తికర దృశ్యం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!

తాడిపత్రిలో మళ్లీ అలజడులు సృష్టించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మా అనుచరులను టార్గెట్ చేశారు. ఇలాంటి వాటికి భయపడేది లేదు. నాకు జామిన్ ఇవ్వకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎవరెన్ని చేసిన తాడిపత్రిలో ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు నేను అండగా ఉంటా అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.

Also Read : వారం రోజుల్లో ఆయన అవినీతి చిట్టాను మీడియాకు అందజేస్తా: ఎమ్మెల్యే పులివర్తి నాని

ఇదిలాఉంటే.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రికి వచ్చారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన పెద్దారెడ్డి.. అప్పటి నుంచి తాడిపత్రికి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల తరువాత మొదటిసారి తాడిపత్రికి పెద్దారెడ్డి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతా అంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పెద్దారెడ్డి తాడిపత్రికి రావటంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. అయితే, పెద్దారెడ్డి.. ఎన్నికల పోలింగ్ మరుసటిరోజు జరిగిన ఘర్షణలో కండిషన్ బెయిల్ కు సంబంధించి సంతకాలు పెట్టడానికి పోలీస్ స్టేషన్ వచ్చారు. ఆ తరువాత తాడిపత్రి నుంచి అనంతపురం బయలుదేరి వెళ్లిపోయాడు. పెద్దారెడ్డి వాహనాలను పోలీసులు కొద్దిదూరం ఫాలో అయ్యారు. అనంతపురంలో పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

 

 

ట్రెండింగ్ వార్తలు