AP liquor Scam Case : ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. జైలు నుంచి ఆ ముగ్గురు రిలీజ్.. అంబటి రాంబాబు ఫైర్..
AP liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

AP liquor scam case
AP liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ జైలులో ఉన్న రిటైర్డ్ అధికారి ధనుంజయ్ రెడ్డిసహా కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఆదివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం బెయిల్ మంజూరైనా అఫిషియల్ ఫార్మాలటీస్ పూర్తి కాకపోవడంతో ఆదివారం ఉదయం వారు జైలు నుంచి విడుదలయ్యారు.
Also Read: YCP MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట.. ఏసీబీ కోర్టు కీలక ఉత్తర్వులు..
ఏసీబీ కోర్టు వీరికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇద్దరు ష్యూరిటీ, లక్ష రూపాయలు పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విదేశాలకు పారిపోకుండా పాస్‌పోర్టు అప్పగించాలని కోర్టు నిందితులకు ఆదేశాలిచ్చింది. తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్లు యాక్టివ్‌లో ఉంచాలని, సాక్షులను గానీ, సహ నిందితులను కలవడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో దిలీప్ (ఏ30)కి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అంబటి రాంబాబు ఫైర్..
శనివారం సాయంత్రమే ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే, కావాలనే వారిని ఆలస్యంగా ఆదివారం ఉదయం విడుదల చేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1989 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా.. ఇంత దారుణమైన ఘటన ఇప్పటి వరకు చూడలేదు. శనివారం సాయంత్రం బెయిల్ వచ్చింది.. శనివారమే విడుదల కావాల్సి ఉంది. కానీ, ఈరోజు (ఆదివారం) ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్సులో బయల్దేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేశ్ చెప్పారు. జైలు నుండి బయటకు రాకుండా ఉండేలా లంచ్ మోహషన్ వేయాలని ఆలస్యం చేశారని అంబటి ఆరోపించారు.
కోర్టు బెయిల్ ఇచ్చినా.. వాళ్ళను బయటకు పంపవద్దని జైలర్‌కు చంద్రబాబు, లోకేశ్ చెప్పారంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు. విడుదలైన తరువాత హైకోర్టుకు వెళ్లండీ.. ఎవరు వద్దన్నారు..? పాల్స్ కేసులో అరెస్టులు చేస్తున్నారు. ముద్దాయిలుగా వెళ్లారు.. హీరోలుగా బయటకు వచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీ నేతలను జైల్లో వేయాలని అనుకుంటున్నారు. అదే మాకు ఆయుధం అవుతుందంటూ కూటమి ప్రభుత్వాన్ని అంబటి రాంబాబు హెచ్చరించారు. వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరగలేదు. లిక్కర్ లో స్కాం ఇప్పుడు జరుగుతుందని అంబటి రాంబాబు అన్నారు.