YCP MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట.. ఏసీబీ కోర్టు కీలక ఉత్తర్వులు..

YCP MP Mithun Reddy : వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

YCP MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట.. ఏసీబీ కోర్టు కీలక ఉత్తర్వులు..

YCP MP Mithun Reddy

Updated On : September 6, 2025 / 12:31 PM IST

YCP MP Mithun Reddy : లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడు వైఎస్ఆర్సీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి (YCP MP Mithun Reddy) కి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఏసీబీ కోర్టు శనివారం మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది.

ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరును సిట్ అధికారులు ఏ4గా చేర్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికాగా.. కోర్టు ఆదేశాల మేరకు జులై 19వ తేదీన సిట్ ఎదుట మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే, సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు.. అదేరోజు రాత్రి అరెస్టు చేశారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.

Also Read: Ganesh Laddu : రూ.35 లక్షలు, రూ.51 లక్షలు, రూ.2కోట్లు, లడ్డూ వేలంతో వచ్చిన డబ్బుతో ఏం చేస్తారు?

మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తాను ఓటు వేయాల్సి ఉంది. దీంతో మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను ఓటేయాల్సిన అవసరం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ కు అర్హత లేదని సిట్ వాదించింది.

ఉపరాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపుతూ బెయిల్ కోరడం సహేతుకం కాదని అభిప్రాయపడింది. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అయితే, తిరిగి ఈనెల 11వ తేదీన సాయంత్రం ఐదు గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కావాలని ఏసీబీ కోర్టు షరతు విధించింది.