AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆ ముగ్గురికి బెయిల్ మంజూరు..

ఇద్దరూ ష్యూరిటీ, లక్ష రూపాయలు పూచీకత్తు సమర్పించాలని కోర్టు చెప్పింది.

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆ ముగ్గురికి బెయిల్ మంజూరు..

AP Liquor Scam Case

Updated On : September 6, 2025 / 7:11 PM IST

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీకి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఇద్దరూ ష్యూరిటీ, లక్ష రూపాయలు పూచీకత్తు సమర్పించాలని చెప్పింది. ఈ కేసులో ఏ31గా ధనుంజయ రెడ్డి, ఏ32గా కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు.

Also Read: వైరల్ వీడియో: ఇది కదా అమ్మాయి పవర్ అంటే.. భారీ డోలుపై నిలబడి.. చీరకట్టులో పూనకం వచ్చినట్టు వాయించేసింది..

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో కె.ధనుంజయరెడ్డి సీఎంవో మాజీ కార్యదర్శిగా, పి.కృష్ణమోహన్‌రెడ్డి జగన్‌ ఓఎస్డీగా ఉన్నారు.

వారి బెయిల్‌ పిటిషన్లను గతంలో ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేసింది. చివరకు ఇప్పుడు వారికి బెయిల్‌ దక్కింది. వారు స్కాంలో కీలకపాత్ర పోషించారని ప్రభుత్వ తరఫున న్యాయవాది పలుసార్లు కోర్టులో వాదనలు వినిపించారు.