వారం రోజుల్లో ఆయన అవినీతి చిట్టాను మీడియాకు అందజేస్తా: ఎమ్మెల్యే పులివర్తి నాని

సాంకేతికంగా దొరికిపోతారనే భయంతోనే ఆరోపణలు చేస్తున్నారని పులివర్తి నాని అన్నారు.

వారం రోజుల్లో ఆయన అవినీతి చిట్టాను మీడియాకు అందజేస్తా: ఎమ్మెల్యే పులివర్తి నాని

Chandragiri MLA Pulivarti Nani

Updated On : July 19, 2024 / 8:41 PM IST

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు. తిరుపతిలో పులివర్తి నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చెవిరెడ్డి తప్పు చేశారు కాబట్టే నింద మోపుతున్నారని చెప్పారు. తనపై జరిగిన దాడిలో ఆయన పాత్ర, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని తెలిపారు.

సాంకేతికంగా దొరికిపోతారనే భయంతోనే ఆరోపణలు చేస్తున్నారని పులివర్తి నాని అన్నారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కాణిపాకంలో ప్రమాణానికి తాను సిద్ధమని ప్రకటించారు. తన ఎదుగుదలను ఓర్చుకోలేక తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

చెవిరెడ్డిని రాజకీయ సమాప్తి చెసేంత వరకు బతికే ఉంటానని పులివర్తి నాని అన్నారు. కరోనా సమయంలో ఎన్ని కోట్ల రూపాయలు వసూళ్లు చేశారో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆయనను జైలుకు పంపించే వరకు విడిచి పెట్టనని అన్నారు. వారం రోజుల్లో చెవిరెడ్డి పూర్తి అవినీతి చిట్టా మీడియాకు అందజేస్తానని చెప్పారు. సర్వే పేరుతో కోట్ల రూపాయలు దోచేశారని అన్నారు. హథీరాంజీ మఠం భూములపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును కోరానని చెప్పారు.

Also Read: 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి..! ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి- జగన్