PM Modi Bhimavaram Tour : రేపు భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఖరారు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతిని పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.

PM Modi Bhimavaram Tour : ప్రధాని నరేంద్ర మోదీ రేపు భీమవరంలో పర్యటించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతిని పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

10.15కి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో భీమవరం చేరుకుంటారు. 10 గంటల 55 నిముషాలకు భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణం చేస్తారు. అల్లూరి 125వ జయంతి వేడుకల్లో పాల్గొని కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. దాదాపు 1 గంట 15 నిముషాల పాటు విగ్రహావిష్కరణ, సభ వద్ద ప్రధాని మోదీ గడపనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు భీమవరం నుంచి ప్రత్యేక హెలిప్యాడ్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రధాని చేరుకుంటారు. 1 గంట 10 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు ప్రధాని మోదీ.

PM Modi : జూలై 4న భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన

భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వస్తున్న ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ రావడం చాలా ఆనందకరమైన విషయం అన్నారు. భీమవరం నుండి పోటీ చేసిన నాకు ఈ వేడుక చాలా ప్రత్యేకం అన్నారు పవన్ కళ్యాణ్. ఈ వేడుకకు రావాలని నాకు ప్రత్యేక ఆహ్వానం తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి జనసేనాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన నేతలకు సూచించారు పవన్ కళ్యాణ్.

Narendra Modi : ప్రధానమంత్రి మోదీ ఏపీ పర్యటన ఖరారు

ట్రెండింగ్ వార్తలు