YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. వివేకా కేసులో సోమవారం వరకు అరెస్టు చేయకుండా స్టే విధించిన కోర్టు

సీబీఐ తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అవినాష్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐకి సూచించింది. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది.

YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. సీబీఐ తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

West Bengal Strike: సమ్మెకు హాజరైతే షోకాజ్ నోటీసు ఇస్తాం.. ఉద్యోగులకు బెంగాల్ ప్రభుత్వం హెచ్చరిక

తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అవినాష్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐకి సూచించింది. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో సాక్షాలుగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి రాసిన లేఖతోపాటు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును కూడా సమర్పించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. కేసుకు సంబంధించిన వివరాలతో కూడిన హార్డ్ డిస్క్‌ను కోర్టుకు సమర్పించాలని సూచించింది.

మంగళవారం మళ్లీ సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి సూచించింది. కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల్లో ఒకడిగా ఉన్న అవినాష్ రెడ్డి.. తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా చూడాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు