Buddha Venkanna: ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంలో వైసీపీ పెద్దల హస్తం ఉంది.. సీబీఐతో విచారణ జరిపించాలి

విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ వ్యవహారంపై, విశాఖలో వైసీపీ నేతల భూ దందాలపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

Buddha Venkanna

TDP Leader Buddha Venkanna: వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని, ఏకంగా అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయిన పరిస్థితులను చూస్తుంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో అర్థమవుతుందని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల  కిడ్నాప్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, విశాఖలో జరిగిన భూ దందాలపై సైతం సీబీఐ విచారణ జరిపించాలని విజయవాడలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

Pawan Kalyan: అధికారంకోసం వైసీపీ ఏం చేయడానికైనా సిద్ధమే.. జనసైనికులు జాగ్రత్తగా ఉండాలి..

బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతిని విశాఖలో అమిత్‌షా చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విశాఖలో భూదందాలు అనేకం జరిగాయని అన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంలో ఆ పార్టీ పెద్దల హస్తం ఉందని బుద్దా వెంకన్న ఆరోపించారు. వాటాల్లో, లాభాల్లో తేడా వచ్చినందుకే వైసీపీ పెద్దల కనుసన్నల్లోనే ఎంపీ కుటుంబం కిడ్నాప్ కు గురైందని అన్నారు. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక పాడు చేసిందని, వైసీపీ నేతలను చూసి విశాఖపట్నం ప్రజలు బెంబేలెత్తుతున్నారని బుద్దా అన్నారు. తక్షణమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించి ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం, విశాఖ‌లో జరిగిన భూ దందాలపై సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు.

TDP MLC Ashok Babu: జగన్ పిల్లలకు మేనమామ కాదు.. దొంగ మామ..

టీడీపీ అధికార ప్రతినిధి నాగులు మీరా మాట్లాడుతూ.. వైసీపీ పాలన ఎప్పుడు పోతుందా అని విశాఖ ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు. రాజధాని పేరుతో విశాఖలో భూ దోపిడీకి వైసీపీ పాల్పడిందని అన్నారు. తక్షణమే ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని నాగులు మీరా డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు