TDP Leader Hariprasad : కొడాలి నానీ..కాపుల గురించి నోటికొచ్చినట్లు వాగితే నాలుక కోస్తాం

కొడాలి నాని కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారనని..కాపుల గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. కాపుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో ఇష్టానుసారంగా కాపుల గురించి తప్పుగా మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు హరి ప్రసాద్.

Andhra Pradesh Kadapa TDP Leader Hariprasad : కొడాలి నాని అంటే గుట్కా నాని, కొడాలి నాని కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని..కాపుల గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. కాపుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో ఇష్టానుసారంగా కాపుల గురించి తప్పుగా మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ కొడాలి నానికి వార్నింగ్ ఇచవ్చారు హరి ప్రసాద్. కడప జిల్లాలోని నగరంలోని హరి టవర్స్ వద్ద బలిజ సంఘ నేతలు హరిప్రసాద్,నాగరాజు, రామచంద్ర ఇతర ముఖ్య నేతల మీడియా సమావేశంలో గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలినానిపై మండిపడ్డారు.

Ganta Srinivasa Rao: మొన్న విడుదల చేసిన మేనిఫెస్టో ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది

కొడాలి నాని కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోం అని .. జగన్ బ్రాండ్ మందు తాగి నానికి పిచ్చి పట్టినట్లు ఉందంటూ సెటైర్లు వేశారు. రానున్న కాలం లో నానిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించడం తప్పదు అంటూ కాపుల గురుంచి అవాకులు చేవాకులు మాట్లాడితే కబడ్డార్..నోరు అదుపులో పెట్టుకోక పోతే తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ హెచ్చరించారు. వైసిపీ కాపు నాయకులు మేల్కొని పార్టీకి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా హరిప్రసాద్ పిలుపునిచ్చారు. కాపులను అవహేళన గా మాట్లాడిన కొడాలి నాని ఇంటిని ముట్టడిస్తాం అని తెలిపారు. కొడాలి నాని కాపుల గురించి ఇలా నోటికొచ్చినట్లుగా వాగుతుంటే వైసిపీలో ఉన్న కాపు నేతలకు చీము నెత్తురు లేదా? అని ప్రశ్నించారు.రానున్న ఎన్నికల్లో కొడాలి నాని కి కాపులే బుద్ది చెప్తారని అన్నారు.

Devineni Uma: టీడీపీ మేనిఫెస్టోను చూసి తాడేపల్లి కొంపలో భూకంపం: దేవినేని ఉమ

కాగా కాపులను తిట్టిన మాజీ మంత్రి కోడాలి నానిపై కాపు యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కొడాలి చేసిన వ్యాఖ్యలకు నిసరనగా కాపు జేఏసీ ఆధ్వర్యంలో నారాయణపురం సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. కాపులను దూషించిన కొడాలి నానిని వెంటనే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాపులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెంటనే కాపు నాయకులకు క్షమాపణ చెప్పాలని లేదంటే కొడాలి నాని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

 

ట్రెండింగ్ వార్తలు