Amaravati-parliament : విజభన చట్టం ప్రకారమే ‘అమరావతి ’ ఏర్పాటైంది : ఏపీ రాజధానిపై కేంద్రం సమాధానం

మూడు రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్ లో అగ్గి రాజేస్తున్న వేళం ఏపీ రాజధాని గురించి పార్లమెంట్ లో కేంద్రం ప్రస్తావించింది. ‘అమరావతి’ విజభన చట్టం ప్రకారమే ఏర్పాటైంది అని స్పష్టం చేసింది కేంద్రం ప్రభుత్వం. రాజ్య సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ‘అమరావతి’ విజభన చట్టం ప్రకారమే ఏర్పాటైంది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాతపూర్వక సమాధానమిచ్చారు.

Amaravati-parliament : మూడు రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్ లో అగ్గి రాజేస్తున్న వేళం ఏపీ రాజధాని గురించి పార్లమెంట్ లో కేంద్రం ప్రస్తావించింది. ‘అమరావతి’ విజభన చట్టం ప్రకారమే ఏర్పాటైంది అని స్పష్టం చేసింది కేంద్రం ప్రభుత్వం. రాజ్య సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ‘అమరావతి’ విజభన చట్టం ప్రకారమే ఏర్పాటైంది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాతపూర్వక సమాధానమిచ్చారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5,6 లతో రాజధాని అమరావతిని ఏర్పడిందని సుస్పష్టం చేశారు. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని..అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం.

అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015 లోనే నోటిఫై చేసిందని..రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని కేంద్రం ముక్తం కంఠంతో చెప్పిందా? అని వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించగా కేంద్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా..ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని తెలిపింది. ఈ అంశం కోర్టులో ఉండగా దీనిపై మాట్లాడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది కేంద్రం.

విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని.. ఈ కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు, నివేదికలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా.. దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాజధానిగా అమరావతినే ఎంపిక చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసిందని..ఆ తర్వాత 2020లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును తీసుకువచ్చిందని అన్నారు.

మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చే ముందు ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని..రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందినే విషయాన్ని ఈ సందర్బంగా మంత్రి నిత్యానంద రాయ్ గుర్తు చేశారు.ప్రస్తుతం అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉందిని దీని గురించి మాట్లాటం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అన్నారు.

 


ట్రెండింగ్ వార్తలు