ఏపీ హోంమంత్రి తానేటి వనిత బస శిబిరంపై టీడీపీ కార్యకర్తలు దాడి.. పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలు

టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడిపై హోంమంత్రి, వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారని, దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు, కార్యకర్తలు కడుపు మంటతో మాపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Home Minister Taneti Vanitha : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో ఏపీ హోంమంత్రి, గోపాలపురం అసెంబ్లీ అభ్యర్ధి తానేటి వనిత బస శిబిరంపై మూకుమ్మడి దాడి చేశారు. ప్రచారం ముగించుకొని మాజీ జడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటివద్ద భోజన విరామానికి తానేటి వనిత ఆగారు. ఆ సమయంలో ఒక్కసారిగా టీడీపీ అభ్యర్థితో పాటు, ఆ పార్టీ కార్యకర్తలు మూకుమ్మడిగా వనిత బస శిబిరంపైకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. కర్రలతో ప్రచార వాహనం, సౌండ్ సిస్టం, అక్కడి వాహనాలను ధ్వంసం చేశారు. భయంతో పరుగులు తీసిన వైసీపీ కార్యకర్తలపై దాడిచేశారు. పోలీస్ కానిస్టేబుల్ ను తోసుకుంటూ వచ్చి టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడి ఘటనతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Also Read : CM Jagan : గాజువాకలో ఎన్డీయే గెలిస్తే జరిగేది ఇదే- సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

విషయం తెలుసుకున్న ఎస్పీ జగదీష్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, దాడిలో స్వయంగా పాల్గొన్నటీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, మాజీ జడ్పీటీసీ ముళ్ళపూడి బాపిరాజు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నట్లు వైసీపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.

Also Read : CM Jagan : చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే: సీఎం జగన్

టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడిపై హోంమంత్రి, వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారని, దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు, కార్యకర్తలు కడుపు మంటతో మాపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ వాళ్లు దాడి చేయడానికి ఎటువంటి గొడవలు లేవు.. అలాంటప్పుడు ఎలావచ్చి దాడులు చేస్తారు. దళిత అభ్యర్థిగా ఉన్న నన్ను కించపర్చే విధంగా, అవమాన పర్చే విధంగా దాడులతో భయపెడుతూ రాజకీయం చేస్తూ గెలవాలని అనుకోవటం ఎంత వరకు కరెక్ట్ అని తానేటి వనిత ప్రశ్నించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు