Posani Krishna Murali
Posani Krishna Murali : మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవికి ప్రజలంటే లెక్కలేదు. ప్రజాసేవ అంటూ పార్టీ పెట్టి మూసేశాడు. సినిమాల్లాగే రాజకీయాల్ని చిరంజీవి బిజినెస్ లా చూశాడు. 18మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి అమ్మేశాడు. రాజకీయాలు వద్దని సినిమాల్లోకి వెళ్లాడు. ఇప్పుడు మళ్లీ రాజకీయ స్టేట్ మెంట్లు ఇస్తున్నాడంటూ పోసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదు. చిరంజీవిని నమ్మి చాలా మంది కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారు. రాజకీయాలకు చిరంజీవి అన్ ఫిట్ అంటూ పోసాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Also Read : ఏపీ హోంమంత్రి తానేటి వనిత బస శిబిరంపై టీడీపీ కార్యకర్తలు దాడి.. పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలు
అభివృద్ధి అంటే పెద్దపెద్ద బిల్డింగ్ లు కాదు.. ప్రజల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి. సీఎం జగన్ ఐదేళ్ల కాలంలో అదేచేశారని పోసాని కృష్ణ మురళి అన్నారు. చంద్రబాబు పాలనలో పేదలు జీవచ్ఛవంలా ఉండిపోయారు. జగన్ సంక్షేమ పాలనలో పేదలు అభివృద్ధిలోకి వచ్చారు. అర్బన్ ప్రాంతాల్లో ఉండే ధనవంతులకు గ్రామాల్లో ఉండే పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి? ఆ పేదల కష్టాలు చూసి సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారు.
Also Read : ఎక్కడున్నారు? తెర ముందుకురాని విజయశాంతి, బండ్ల గణేశ్
చంద్రబాబు అండ్ కో కి పేదలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే రెవెన్యూ లోటు ఉంటుంది. చంద్రబాబు 14ఏళ్ల పాలనలో ఏం సంపద సృష్టించాడు. అర్బన్ ఓటర్లు చంద్రబాబు ఏం చేశాడో.. జగన్ ఏం చేశాడో ఆలోచించాలి. అర్బన్ ఓటర్లు గ్రామాల్లో పేద కుటుంబాల్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని పోసాని కృష్ణ మురళి కోరారు.