Vijayawada Mutton: బెజవాడలో బయటపడ్డ కుళ్లిన మాంసం దందా

విజయవాడ కార్పొరేషన్ అధికారులు అలర్ట్ అవడంతో బెజవాడలో కుళ్లిన మాంసం అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెజవాడలో కుళ్ళిన మేక మాంసం, గొర్రె తలకాయి, కాళ్లు, గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారంటూ 10 టీవీ వరుస కథనాలతో అధికారులకు సమాచారం అందింది.

 

 

Vijayawada Mutton: విజయవాడ కార్పొరేషన్ అధికారులు అలర్ట్ అవడంతో బెజవాడలో కుళ్లిన మాంసం అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెజవాడలో కుళ్ళిన మేక మాంసం, గొర్రె తలకాయి, కాళ్లు, గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారంటూ 10 టీవీ వరుస కథనాలతో అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు దాడులు జరిపిన నిందితులను అరెస్టు చేసి.. ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో తనిఖీలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన.. “విజయవాడ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ రవిచంద్ సోమవారం కుళ్ళిన మాసం విక్రయిస్తున్న రాము అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని షాపు కూడా సీజ్ చేశాం. ఇంకా ఎవరైనా కుళ్లిన మాంసం అనే దిశగా మంగళవారం కూడా తనిఖీలు జరిపాం. విజయవాడ పడమట, బెంజ్ సర్కిల్, ఆటోనగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాం”

“మాంసం విక్రయిస్తున్న షాపులను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నాం. షాపులోని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన చికెన్ లేదా మటన్ ఉందా అని తనిఖీ చేస్తున్నాం. అంతేకాకుండా షాపు వాతావరణం శుభ్రంగా ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. తనిఖీలు నిరంతరం కొనసాగిస్తాం. కుళ్ళిన మాంసం విక్రయిస్తున్నారని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు”

Read Also: మటన్ తినటం ఆరోగ్యానికి మంచిదేనా?

“అసోసియేషన్ ప్రతినిధులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఇలాంటివి ఎవరైనా కొనసాగిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. అసోసియేషన్ ప్రతినిధులకు కూడా ఇలాంటి విక్రయిస్తున్నట్లు వారి దృష్టికి వస్తే వెంటనే మా దృష్టికి తేవాలని ఆదేశాలు జారీ చేశాం” అని వివరించారు.

బాజీ మటన్ అసోసియేషన్ ప్రతినిధి మాట్లాడుతూ.. “తక్కువ ధరకు మటన్, చికెన్ విక్రయిస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది మటన్ వ్యాపారస్థులు చనిపోయిన మేకలు 3 వేలకు 4 వేలకు కొనుగోలు చేసి తక్కువకు విక్రయిస్తున్నారు. గతంలో అలాంటి వారి గురించి అసోసియేషన్ తరపున కార్పొరేషన్ హెల్త్ అధికారులకు సమాచారం ఇచ్చి షాపులను సీజ్ చేయించింది” అని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు