Nara Lokesh : జాగ్రత్త.. మీ వ్యక్తిగత వివరాలిస్తే ఆస్తులు కొట్టేస్తారు, వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం- నారా లోకేశ్

Nara Lokesh : అన్నదాతకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. మేము వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం.

Nara Lokesh(Photo : Twitter)

Nara Lokesh – Kandukur : కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంలో బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కందుకూరు నేలపై పాదయాత్ర చెయ్యడం తన అదృష్టం అన్నారు. యువగళం ప్రభంజనం చూసి వైసీపీ వాళ్లు ప్యాంట్లు తడుపుకుంటున్నారు అని లోకేశ్ అన్నారు. యువగళం దెబ్బకి వైసీపీ ప్యాకప్ ఖాయం అన్నారు. జగన్ ప్రతి స్కీం వెనకా ఒక స్కాం ఉంటుందన్నారు.

”గజ దొంగ జగన్ ఇప్పుడు డేటా దొంగ అవతారం కూడా ఎత్తాడు. జాగ్రత్త మీ వ్యక్తిగత సమాచారం ఇస్తే మీకున్న ఆస్తులు కూడా కొట్టేయడం ఖాయం. జగన్ ది పిల్ల కాలువ రేంజ్. చంద్రబాబుది పోలవరం రేంజ్. పిల్ల కాలువ తవ్వడం రానివాడు పోలవరం పూర్తి చేస్తాడా? విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు.(Nara Lokesh)

Also Read..Pilli Subhash Chandra Bose: పిల్లి సుభాశ్‌చంద్రబోస్ వైఖరిలో మార్పు ఎందుకొచ్చింది.. అసంతృప్తిగా ఉన్నారా?

జగన్ మహిళలను నమ్మించి మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2వేల 500 కోట్లు కొట్టేశాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేశాడు.

టీడీపీ ప్రభుత్వం వస్తే.. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3వేలు ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

అన్నదాతకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. మేము వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితులను ఎలా చంపారో చూశారు. తాడిపత్రిలో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు.

Also Read..YCP: వైసీపీలో వారసుల సందడి.. తలలు పట్టుకుంటున్న వైసీపీ పెద్దలు..!

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందిస్తాం. కందుకూరు టౌన్ లో రోడ్లు, పార్కులు ఏర్పాటు చేశాం. ఆ పనులు కూడా ఆపేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. కందుకూరులో పసుపు జెండా ఎగిరి 25 ఏళ్లు అయ్యింది. కందుకూరులో టీడీపీని గెలిపించండి. అధికారంలోకి వచ్చిన వెంటనే కందుకూరుని ప్రకాశం జిల్లాలో కలుపుతాం. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిన ఎవ్వరినీ వదిలి పెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. కష్ట కాలంలో జెండా మోసిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా” అని నారా లోకేశ్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు