2023 Komaki TN 95 : యాంటీ-స్కిడ్ టెక్నాలజీతో కొమాకి TN 95 ఎలక్ట్రిక్ స్కూటర్.. టాప్ స్పీడ్ 85కి.మీ, ధర ఎంతో తెలుసా?

2023 Komaki TN 95 Launch : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? 2023 ఏడాదిలో కొమాకి TN 95 అనే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్భారత మార్కెట్లో లాంచ్ అయింది. రెండు వేరియంట్లలో ఈ కొమాకి TN మోడల్ ఈవీ స్కూటర్‌ను అందిస్తోంది.

2023 Komaki TN 95 Launch : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ కొమాకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ కొమాకి ఈవీ స్కూటర్ధర రూ. 1,31,035 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. ఈ బైకులో మోడల్ యాంటీ-స్కిడ్ టెక్నాలజీ, LiFePO4 (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) యాప్-ఆధారిత స్మార్ట్ బ్యాటరీలతో వస్తుంది. ఇందులోని బ్యాటరీలు అగ్ని-నిరోధకతను కలిగి ఉంటాయి.

2023 (Komaki TN 95) డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, కీలెస్ కంట్రోల్ కొత్త కీ ఫోబ్‌ను అందిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట స్పీడ్ గంటకు 85కిమీ దూసుకెళ్తుంది. ఇందులో 18-లీటర్ బూట్ కూడా ఉంది. 2023 Komaki TN 95 ప్రత్యేక ఫీచర్లలో డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్, LED DRL, LED ఫ్రంట్ వింకర్‌లు, TFT స్క్రీన్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, ఆన్-రైడ్ కాలింగ్, పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ ఉన్నాయి.

Read Also : Svitch Electric Bike : హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ స్విచ్ బైక్ నుంచి కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్..!

కొమాకి బైకులో మెటల్ గ్రే, చెర్రీ రెడ్ వంటి కలర్ ఆప్షన్లు ఉన్నాయి. 5kW హబ్ మోటార్ ద్వారా పవర్ అందిస్తుంది. 50amp కంట్రోలర్‌ను ఉపయోగిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 3 గేర్ మోడ్‌లను కలిగి ఉంది. ఎకో, స్పోర్ట్స్, టర్బో రీజెన్‌తో వచ్చాయి. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. 2023 Komaki TN 95 స్కూటర్130-150km, 150-180km పరిధిని బట్టి రెండు వేరియంట్‌లలో అందిస్తోంది. 2023 Komaki TN 95 ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

2023 Komaki TN 95 Launch

* 2023 Komaki TN 95 స్కూటర్ (130-150km) పరిధి రూ. 1,31,035
* 2023 Komaki TN 95 స్కూటర్ (150-180km) పరిధి రూ. 1,39,871

Read Also : Mahindra Thar SUV : 5 డోర్లతో మహీంద్రా థార్ SUV వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు