Jio OTT Plan : జియో బెస్ట్ పోస్ట్‌పెయిడ్ ఓటీటీ ప్లాన్‌.. 15 ఓటీటీ యాప్స్‌ బెనిఫిట్స్, కేవలం రూ. 888 మాత్రమే..!

Jio OTT Plan : జియో కొత్త రూ. 888 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ డేటా, 15+ టాప్ ఓటీటీ యాప్‌లకు ప్రత్యేక యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ఓటీటీ ప్లాన్ గురించి అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Jio OTT Plan : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో స్ట్రీమింగ్ ఔత్సాహికులను ఆకర్షించేందుకు బెస్ట్ పోస్ట్‌పెయిడ్ ఓటీటీ బండిల్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్‌తో పాటు అద్భుతమైన స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ఈ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. నెలకు రూ. 888 ధరతో జియోఫైబర్ (JioFiber), జియో ఎయిర్ ఫైబర్ (Jio AirFiber) కస్టమర్‌లకు అందుబాటులో ఉంది.

Read Also : Vivo X100 Ultra : వివో X100 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కెమెరా ఫీచర్లు లీక్..!

స్ట్రీమింగ్, అన్‌లిమిటెడ్ కంటెంట్ యాక్సెస్ కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌తో జియో కొత్త ప్లాన్ కస్టమర్లకు 30ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. అంతేకాకుండా, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియం వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లతో సహా 15 ప్రముఖ ఓటీటీ యాప్‌లకు సబ్‌స్క్రైబర్‌లు ప్రత్యేక యాక్సెస్‌ను పొందవచ్చు.

ఎవరు సైన్ అప్ చేయగలరంటే? :
ఈ సమగ్ర ఆఫర్ బేస్ స్పీడ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. వినియోగదారులకు పూర్తి డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్ కోరుకునే కొత్త సబ్‌స్క్రైబర్ అయినా లేదా 10ఎంబీపీఎస్ లేదా 30ఎంబీపీఎస్ ప్లాన్‌లో ఇప్పటికే ఉన్న యూజర్ అయినా, రూ. 888 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రతి ఒక్కరి స్ట్రీమింగ్ అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. \

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఉన్న వారితో సహా, ఇప్పటికే ఉన్న యూజర్లందరూ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు ఈజీగా అప్‌గ్రేడ్ చేయవచ్చు. అదనపు బోనస్‌గా ప్రత్యేక ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు, అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లు తమ జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై 50 రోజుల తగ్గింపును పొందవచ్చు.

ఈ ఆఫర్ మే 31, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. జియో కొత్త పోస్ట్‌పెయిడ్ ఓటీటీ ప్లాన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్ ఆస్వాదించవచ్చు. హై-స్పీడ్ డేటా, టాప్ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ పొందవచ్చు. అంతేకాదు.. ప్రీమియం ఓటీటీ కంటెంట్‌కు యాక్సెస్‌ పొందవచ్చు.

అదనంగా, ఇటీవల ప్రకటించిన జియో ఐపీఎల్ ధన్ ధనా ధన్ ఆఫర్ కూడా ఈ ప్లాన్‌పై వర్తిస్తుంది. అర్హత ఉన్న సబ్‌స్క్రైబర్‌లు తమ జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై 50-రోజుల డిస్కౌంట్ క్రెడిట్ వోచర్‌ను పొందవచ్చు. జియోఫైబర్ లేదా ఎయిర్‌ఫైబర్ కావచ్చు.

Read Also : Tecno Camon 30 Series : టెక్నో కామన్ 30 సిరీస్ వచ్చేస్తోంది.. సోనీ కెమెరాలతో మొత్తం 4 మోడల్స్.. పూర్తి వివరాలివే!

ట్రెండింగ్ వార్తలు