Gold Price Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold and Silver Rate Today : ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. శనివారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 300 తగ్గగా.. కిలో వెండిపై 700 తగ్గింది. దీంతో పసిడి, వెండి కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించినట్లయింది.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా తగ్గింది.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,250కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,360.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,400 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,510.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,250 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,360.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,500 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.73,640.

 

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర తగ్గింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.90,500.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 90,500.
    కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.87,000.
    బెంగళూరులో మాత్రం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 87,100.

 

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు

 

 

ట్రెండింగ్ వార్తలు